పవన్ కి నేనున్నాను: పూరి జగన్నాధ్

మరిన్ని వార్తలు

పవన్ కళ్యాణ్ పైన అతని తల్లి పైన చేసిన ఆరోపణలకి నిరసన తెలుపుతూ ఈరోజు ఉదయం ఫిలిం చాంబర్ లో ఆయన కుటుంబసభ్యులు కొద్దిసేపు నిరసన వ్యక్తంచేశారు.

ఇక ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కి ఫిలిం ఇండస్ట్రీ తరపున పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఇందులో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ ఈ అంశం పైన తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.పూరి పెట్టిన పోస్ట్ మీరు చూడండి-

నాకు జీవితాన్ని ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బాధపడటం నాకు చాలా బాధ కలిగించింది . అతనిని ఎప్పుడూ ఇలా చూడలేదు . Rgv చేసిన పని నాకు నచ్చలేదు. ప్రాణం ఉన్నంత వరకూ I support Pawan kalyan.

అయితే ఆర్జీవీ-పూరి ఎంత సన్నిహితంగా ఉంటారో అందరికి తెలిసిన విషయమే. అలాంటిది ఈ అంశంలో పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయడంతో న్యాయం వైపు నిలబడినందుకు అందరూ పూరిని మెచ్చుకుంటున్నారు.

ఇక పూరి పెట్టిన పోస్ట్ కి ఆర్జీవీ సారీ సర్ అని రిప్లై ఇవ్వడం కొసమెరుపు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS