లైగర్ కష్టాలు పూరి ని ఇంకా వెంటాడుతూనే వున్నాయి. లైగర్ వల్ల చాలా నష్ట పోయామని, తమకు ఎంతోకంత తిరిగి చెల్లించాలని బయ్యర్లు పూరి పై ఒత్తిడి తెచ్చారు. పూరి కూడా డబ్బులు తిరిగి ఇస్తా అని మాట ఇచ్చాడు. ఐతే ఈలోగా కొంతమంది ఓవర్ యాక్షన్ చెయ్యడం తో కథ అడ్డం తిరిగింది. ఇప్పుడు ఒక్క పైసా కూడా తిరిగి ఇవ్వను అని పూరి మొండికేసే పరిస్థితి వచ్చింది.
పూరి బయ్యర్లకు డబ్బులు చెల్లిస్తా అని మాట ఇచ్చిన విషయం వాస్తవం. కాకపోతే అందుకు కాస్త సమయం అడిగాడు.ఈలోగా కొంత మంది ఓవర్ యాక్షన్ చేశారు. పూరి ఇంటిముందు, ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని బెదిరింపులకు దిగారు. ఛాంబర్ ద్వారా నోటీసులు పంపారు. దీనిపై పూరి సీరియస్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన ఒక ఆడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నన్ను బ్లాక్ మెయిల్ చేస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వను.. ఏం చేసుకుంటారో చేసుకోండి అని పూరి రివర్స్ అవ్వడం ఆ ఆడియో టేప్ సారాంశం. సినిమా ఒక పేకాట లాంటిదని, అందులో ఒక్కోసారి డబ్బులు వస్తాయి.. పోతాయి అని, సినిమా హిట్ అయితే బయ్యర్ల దగ్గర నుంచి డబ్బులు రాబట్టడానికి నానా తిప్పలు పడాలని, చాలామంది తనకు డబ్బులు ఎగ్గొట్టారు అని పూరి చెప్పుకు వచ్చాడు. ధర్నా చేస్తే చెయ్యండి అని.. అలా చేస్తే వాళ్లకు తప్ప అందరికీ డబ్బులు ఇస్తా అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు పూరి.