Puri Jagannath: పూరికి పాతిక కోట్లు కావాలి

మరిన్ని వార్తలు

‘లైగర్' పరాజయం దర్శకుడు పూరీ జగన్నాథ్‌ కి పీడకలని మిగిల్చింది. ఆ చిత్రం వల్ల ఆర్థికంగా నష్టపోయామని, డబ్బులు తిరిగి చెల్లించాలంటూ పలువురు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు బెదిరింపులకు పాల్పడుతున్నారని పూరీ జగన్నాథ్‌ జూబ్లిహిల్స్‌ పోలీసులను సైతం ఆశ్రయించారు. ప్రాణ హాని ఉందని, తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరగా పోలీసులు ఆయన నివాసం వద్ద భద్రత కూడా కల్పించారు.

 

అయితే పూరి ఇప్పుడీ చిక్కుల నుండి బయటపడాలంటే 25 కోట్ల రూపాయిలు కావాలి. నష్టపోయిన వారికీ 30 శాతం వెనక్కి ఇస్తానని హామీ ఇచ్చారట పూరి. ఈ లెక్కన సెటిల్ చేయాలంటే 25 కోట్ల రూపాయిలు కావాలి. అందరినీ కొంత సమయం అడిగాడు పూరి. అయితే ఇచ్చిన గడువు ముసిగిపోవడంతో గొడవలు మొదలయ్యాయి. పూరికి స్థిరాస్తులు వున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు అమ్మడం కుదరని పని. అందుకే ఇప్పుడు అప్పు వేటలో వున్నారు పూరి. 25 కోట్ల అప్పు దొరికితే ఈ వివాదం ముగిసినట్లే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS