పూరి గురి... ప‌వ‌న్ పై..?!

మరిన్ని వార్తలు

ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర‌వాత పూరి జ‌గ‌న్నాథ్ కి త‌న‌పై త‌న‌కు న‌మ్మ‌కం పెరిగింది. ఆ త‌ర‌వాత ఏకంగా పాన్ ఇండియా సినిమానే ప్లాన్ చేశాడు. అదీ... విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో. ఇప్పుడు త‌న దృష్టంతా టాప్ స్టార్ల‌పైనే ఉంది. విజ‌య్ దేవ‌ర‌కొండ త‌ర‌వాత‌.. కూడా స్టార్ హీరోతోనే ప‌నిచేయాల‌ని ఫిక్స‌య్యాడు. లాక్ డౌన్ స‌మ‌యంలో కొన్ని క‌థ‌లు రెడీ చేసుకున్నాడు పూరి. అందులో ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం ఓ క‌థ ఉంద‌ని టాక్‌.

 

ప‌వ‌న్ - పూరి ల కాంబోకి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకించి చెప్పుకోవాల్సిన ప‌నిలేదు. బ‌ద్రితో.. ఈ కాంబో ప‌వ‌రేంటో అర్థ‌మైంది. కెమెరామెన్ గంగ‌తో రాంబాబు క‌మ‌ర్షియ‌ల్ గా స‌క్సెస్ కొట్ట‌లేదు గానీ, ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి న‌చ్చేలా ఆ సినిమా తీయ‌గ‌లిగాడు. ఇప్పుడు ప‌వ‌న్ తో హ్యాట్రిక్ కొట్ట‌డానికి స‌మాయాత్తం అవుతున్నాడ‌ట‌. ప‌వ‌న్ అప్పాయింట్ మెంట్ కోసం పూరి ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాడ‌ని, త్వ‌ర‌లోనే ప‌వ‌న్ ని క‌లిసి, క‌థ చెప్పాల‌న్న ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడ‌ని టాక్‌. అయితే ప‌వ‌న్ ఇప్పుడు ఫుల్ బిజీ. రెండేళ్ల వ‌ర‌కూ కాల్షీట్లు ఇవ్వ‌లేని ప‌రిస్థితి. ప‌వ‌న్ క‌థ విన్నా - ఓకే అంటాడ‌న్న న‌మ్మ‌కం లేదు. కానీ పూరి మాత్రం ప‌వ‌న్ అప్పాయింట్ మెంట్ దొరికితే చాలు, మిగిలిన విష‌యాలు నేను చూసుకుంటా అంటున్నాడ‌ట‌. మ‌రి.. అదెప్పుడు కుదురుతుందో?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS