పూరి - విజ‌య్‌.. రిపీటే...!

By Gowthami - January 27, 2022 - 10:10 AM IST

మరిన్ని వార్తలు

విజ‌య్ దేవ‌ర‌కొండ - పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో `లైగ‌ర్‌` రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. పూరి తీస్తున్న‌, విజ‌య్ చేస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇదే. దీనిపై అభిమానుల్లో చాలా అంచ‌నాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా త‌ర‌వాత పూరి - విజ‌య్‌ల కాంబినేష‌న్ మ‌ళ్లీ రిపీట్ అవ్వ‌బోతోంద‌ట‌. `లైగ‌ర్` రిజ‌ల్ట్ ఎలా ఉన్నా, వీరిద్ద‌రితో ఓ సినిమా చేయ‌డానికి క‌ర‌ణ్ జోహార్ ముందుకొచ్చాడ‌ట‌. `లైగ‌ర్‌`కి క‌ర‌ణ్ ఓ నిర్మాత‌. ఈ సినిమాని బాలీవుడ్ లో రిలీజ్ చేస్తోంది ఆయ‌నే. ``మ‌నం క‌లిసి మ‌రో సినిమా చేయాలి`` అని క‌ర‌ణ్ చెప్ప‌డ‌మే కాదు, పూరి - విజ‌య్‌ల‌తో అగ్రిమెంట్ కూడా చేయించుకున్నాడ‌ని టాక్‌.

 

ఈ సినిమాలో క‌థానాయిక‌గా జాన్వీ క‌పూర్ ని ఎంచుకున్న‌ట్టు కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. `లైగ‌ర్‌`లో జాన్వీక‌పూర్‌నే తీసుకుందాం అనుకున్నారు.కానీ కుద‌ర్లేదు. జాన్వీ కూడా ఎప్ప‌టి నుంచో టాలీవుడ్ లో అడుగుపెట్టాల‌ని చూస్తోంది. కానీ.. స‌రైన అవ‌కాశం రావ‌డం లేదు. జాన్వీకి కూడా విజ‌య్ దేవ‌రకొండ అంటే చాలా ఇష్టం. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో విజ‌య్ త‌న అభిమాన న‌టుడ‌ని చెప్పుకొచ్చింది. సో.. ఈ సినిమాలో న‌టించ‌డానికి జాన్వీకి ఎలాంటి అభ్యంత‌రాలూ లేక‌పోవొచ్చు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS