ఈ రోజుల్లో బడా హీరోల సినిమాలంటే.. ఎలివేషన్లు భారీగా ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు. హీరో ఇంట్రడక్షన్ కి అయితే... తెగ ఖర్చు పెడుతున్నారు. ఓ ఫైటు, ఆ వెంటనే పాట.. ఇలా హీరోని పరిచయం చేస్తున్నారు. పుష్పలో.. బన్నీని ఓ భారీ యాక్షన్ సీన్‌తో పరిచయం చేశాడు సుకుమార్. ఆ సీన్ సినిమా మొత్తానికి హైలెట్ అయ్యింది. ఇప్పుడు పుష్ప 2 రూపుదిద్దుకొంటోంది. ప్రస్తుతం విశాఖపట్నంలో షూటింగ్ జరుగుతోంది. ఇక్కడ ఓ పాట చిత్రీకరిస్తున్నారు. ఇది హీరో ఇంట్రడక్షన్ సాంగ్.
అచ్చంగా పుష్ప 1లానే... ఓ ఫైటు, ఆ తరవాత పాటతో.. బన్నీని తెరపైకి తీసుకొస్తున్నారట. ఈ పాట, ఫైటు.. అదరహో అనేలా ఉండబోతున్నాయని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ పాట, ఫైటు కోసమే దాదాపుగా రూ.6 కోట్ల వరకూ ఖర్చు పెట్టబోతున్నారని సమాచారం. విశాఖలో షెడ్యూల్ ముగిసిన వెంటనే చిత్రబృందం హైదరాబాద్ తిరిగి వస్తుంది. ఇక్కడకు వచ్చాక మరో మరో భారీ షెడ్యూల్ ఉంటుంది. ఈ షెడ్యూల్ లో రష్మిక, సునీల్, ఫహద్ ఫాజిల్ కూడా పాలు పంచుకొంటారని సమాచారం. మైత్రీ మూవీస్ సంస్థ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.