పుష్ప రాజ్ వేట మొదలయింది

మరిన్ని వార్తలు

ప్రజంట్ టాలీవుడ్ లో క్రేజీ హీరోగా దూసుకుపోతున్నాడు అల్లు అర్జున్. పట్టిందల్లా బంగారమే అన్నట్టు ఉంది బన్నీ లక్ . 'తగ్గేదేలే' అని సుకుమార్ ఏ ముహుర్తాన చెప్పించాడో కానీ బన్నీ అదే రేంజ్ లో అన్నిటా నంబర్ వన్ రేస్ లో కొనసాగుతున్నాడు. పుష్ప మూవీ తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు, టాలీవుడ్ కి అందని ద్రాక్షలా ఉన్న నేషనల్ అవార్డు సాధించాడు. టుస్సాడ్ మ్యూజియంలో కొలువుదీరిన తొలి సౌతిండియన్ హీరో గా విజయ బావుటా ఎగరేసాడు.  ఇప్పుడు పుష్ప 2 తో బరిలోకి దిగి రికార్డ్ ల వేట మొదలుపెట్టాడు.   మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీల్లో 'పుష్ప 2' ఒకటి. ఈ మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.  బన్నీ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ నిడివి కేవలం నిమిషం ఐదు సెకన్లు, కానీ ఈ టీజర్ సరికొత రికార్డులు సృష్టిస్తూ యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. 


టీజర్ లో అల్లు అర్జున్ చీరకట్టుతో అమ్మోరు గెటప్ లో కనిపించి గూస్ బంప్స్ తెప్పించాడు. దీంతో సినీ ప్రియులకి  అంచనాలు రెట్టింపు అయ్యాయి. ప్రజంట్ ట్రెండింగ్ లో ఉన్న ఈ టీజర్ ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించింది. 'పుష్ప 2' టీజర్ భారీ వ్యూస్,  లైక్స్ తో రికార్డ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. తక్కువ టైంలో 110 మిలియన్ల వ్యూస్ ని, 1.55 మిలియన్ల లైక్స్ ని సొంతం చేసుకుని ఇప్పుడు మరో కొత్త రికార్డు నెలకొల్పింది. 'పుష్ప 2' టీజర్.  యూట్యూబ్ లో 138 గంటల పాటు నంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్ లో రన్ అవుతున్న ఏకైక టీజర్ గా కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ, పోస్టర్ రిలీజ్ చేశారు.  ఈ విషయం తెలిసిన బన్నీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.  
 

మైత్రి మూవీ మేకర్స్ 300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీకి ఇప్పటికే సగం బిజినెస్ జరిగినట్టు టాక్.  'పుష్ప 2' మ్యూజిక్ రైట్స్  అన్ని భాషలకి కలిపి 60 కోట్లు దక్కించుకున్నట్లు సమాచారం.  మ్యూజిక్ రైట్స్ ఈ రేంజ్ లో చెల్లుబాటు అవటం ఇదే మొదటిసారి. 'పుష్ప 2' ఆడియో రైట్స్  మాత్రమే కాదు, ఓటీటీ రైట్స్ కూడా నెట్ ఫ్లిక్స్ సంస్థ 100 కోట్లకు లాక్ చేసినట్లు తెలుస్తోంది. అప్పుడే 160 కోట్ల బిజినెస్ జరిగింది. ఇంకా థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ఉండనే ఉన్నాయి. ఇలా రిలీజ్ కి ముందే రికార్డ్ వేట మొదలుపెడితే ఆఫ్టర్ రిలీజ్ తగ్గేదేలే అన్నట్టు ఉంటాయేమో పుష్పరాజ్ కలక్షన్స్.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS