అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం పుష్ష. ఇందులో రష్మిక కథానాయిక. ఈ చిత్రంలో రెండో హీరోయిన్‌కీ ఛాన్సుందని, ఆ ప్లేసులో ఓ స్టార్ హీరోయిన్ కనిపించనుందని వార్తలొచ్చాయి. కొంతమంది పేర్లు కూడా వినిపించాయి. అయితే ఈ విషయంలో చిత్రబృందం క్లారిటీ ఇచ్చేసింది. పుష్షలో రెండో కథానాయిక ఉన్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని, రష్మిక తప్ప మరో నాయికకు కథలో చోటు లేదని దర్శకుడు సుకుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు మైత్రీ మూవీస్ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.
అయితే... పుష్షలో ఓ ఐటెమ్ గీతం మాత్రం ఉంది. ప్రత్యేక గీతాల్లో స్టార్ హీరోయిన్లు కనిపించడం సాధారణమైపోయింది. ఆ మేరకు మరో కథానాయిక కనిపించొచ్చేమో గానీ, రెండో నాయిక పాత్రంటూ ఈ కథలో లేదు. విజయ్‌సేతుపతి కీలకమైన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.