'పుష్ప' సినిమాపై మొదటి వివాదం తెరపై కి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ కి చెందిన పురుష సంఘం ఒకటి పుష్ప ఐటెం సాంగ్ ను బ్యాన్ చేయాలంటూ పిటిషన్ చేసింది.పాటలో లిరిక్స్ చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని.. మగాళ్లను తక్కువ చేస్తూ రాశారని, మగాళ్ల బుద్ధి వంకర బుద్ధి అని.. వాళ్లు కేవలం సెక్స్ గురించే ఆలోచిస్తారన్నట్లుగా లిరిక్స్ ఉన్నాయని సదరు సంఘం పిటిషన్ లో పేర్కొంది.
అల్లు అర్జున్ కధానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మాస్, యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప. రెండు భాగాలుగా రూపొందించిన ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ‘పుష్ప ది రైజ్’ డిసెంబరు 17న థియేటర్‌లలో విడుదల కానుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ‘పుష్ప’ తెరకెక్కింది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. సమంత ఐటెం పాట కూడా విపరీతంగా ఆకట్టుకుంది, అయితే ఇప్పుడీ పాట సాహిత్యంపై వివాదం నెలకొంది. మరి దినిపై రచయిత చంద్రబోస్, చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తారో చూడాలి.