పుష్ప ట్రైలర్: పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా .. ఫైరు

మరిన్ని వార్తలు

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ ‘పుష్ప’ ట్రైలర్ బయటికి వచ్చింది. సుకుమార్ మార్క్ మేకింగ్, అల్లు అర్జున్ స్టయిల్ యాక్షన్ తో అదిరిపోయింది ట్రైలర్. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపధ్యంలో ఈ సినిమా ఉండబోతుందని ఇప్పటికే తెలిసింది. ట్రైలర్ లో అదే పాయింట్ ని ఓపెన్ చేశారు. ''భూమండలంలో యాడా పెరగని సెట్టు.. మన శేషచలం అడవుల్లో పెరగతండాది. ఈడ నుంచి యాల కోట్ల సరుకు విదేశాలకు స్మగ్లింగ్ అవుతుండాది.. గోల్డ్ రా ఇది. భూమిపై పెరిగే బంగారం.. పేరు ఎర్ర చందనం'' అనే డైలాగ్ తో ట్రైలర్ రివిల్ చేశారు. ఈ డైలాగ్ తర్వాత విజువల్స్ అన్నీ సూపర్ ఫాస్ట్ గా కదిలాయి. ఒక ఎలివేషన్ తో బన్నీ కనిపించాడు. అయితే బన్నీ ఫేస్ ని మాత్రం చాలా నేచురల్ గా జైల్లో దెబ్బలు తింటూ రివిల్ చేశారు.

 

అయితే తర్వాత షాట్ లో బన్నీ డబుల్ యాక్షన్ అన్నట్టు.,. 'బాస్' గా చూపించారు. ఇది చాలా ఆసక్తికరంగా వుంది. అల్లు అర్జున్ స్టయిలీస్ స్టార్. కానీ మొదటిసారి గూని పాత్రలో కనిపించడం కొత్తగా వుంది. రష్మిక కి కూడా ఇదే మొదటి డిగ్లామర్ రోల్. అయితే శ్రీవల్లి పాత్రలో ముచ్చటగా వుంది. శ్రీవల్లి, పుష్పల సీన్స్ తర్వాత ట్రైలర్ మళ్ళీ యాక్షన్ లోకి వెళ్ళిపోయింది. అడవి నేపధ్యంలో సాగిన యాక్షన్ ఘట్టాలు ఆకట్టుకునేలా వున్నాయి. సునీల్ చెప్పిన ఓ డైలాగ్ కూడా వినిపించింది. అనుసూయ ఒక బోల్డ్ షాట్ లో కనిపించింది. ఈ ట్రైలర్ లో కొసమెరుపు బన్నీ చెప్పిన డైలాగ్.. ''పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా .. ఫైరు'' అని చిత్తూరు యాసలో బన్నీ చెప్పిన డైలాగ్ ట్రైలర్ కి ఫైనల్ పంచ్. ఇక ట్రైలర్ కోసం దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన నేపధ్య సంగీతం నెక్స్ట్ లెవెల్ లో వుంది.

 

‘ఆర్య’, ‘ఆర్య 2’ తర్వాత అల్లు అర్జున్‌, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రమిది. అంతేకాదు.. రంగస్థలం లాంటి క్లాసిక్ తర్వాత సుకుమార్ నుంచి వస్తున్న సినిమా, అలాగే అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అల్లు అర్జున్ నుండి వస్తున్న సినిమా కావడంతో పుష్ప పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు చిత్ర పారిశ్రమ కూడా పుష్పపై చాలా అంచనాలు పెట్టుకుంది. సాహో తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వస్తున్న మరో పాన్ ఇండియా మూవీ కూడా పుష్పనే. ఇన్ని ఆశలు అంచనాల మధ్య ‘పుష్ప- ది రైజ్‌’ డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS