పుష్షని 2 భాగాలుగా విడుదల చేయాలన్న సుకుమార్ ఆలోచన... మైత్రీ మూవీస్‌కి కాసుల వర్షం కురిపించబోతోంది. ఒక కథ.. రెండు సినిమాలు... అనేది లాభ దాయకమైన ప్రాజెక్ట్ అనే విషయం `బాహుబలి`తో నిరూపణ అయ్యింది. ఆ స్థాయిలో కాకపోయినా, `పుష్ష`కీ అదిరిపోయే మార్కెట్ జరగడం ఖాయం. అయితే పుష్ష 1కీ 2కీ మధ్య గ్యాప్ ఎంత? అనేది ఆసక్తిగా మారింది. పుష్ష 1 విడుదలైన చాలా కాలానికి రెండో భాగం వస్తుందని, ఈ గ్యాప్ లో బన్నీ మరో సినిమా కూడా మొదలెట్టేస్తాడని ప్రచారం జరుగుతోంది.
అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. పుష్ష 1కీ, 2 కీ మధ్య అంతగా గ్యాప్ ఉండకపోవొచ్చు. పైగా.. పుష్ష రెండు భాగాలకు సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయిన తరవాతే, బన్నీ మరో సినిమా చేస్తాడని తెలుస్తోంది. ఇప్పటికే పుష్ష 1కి సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తయిందని తెలుస్తోంది. పుష్ష 1 కోసం మిగిలిన పార్ట్ కూడా పూర్తయిన తరవాత, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలవుతాయి, దాంతో పాటుగా సమాంతరంగా పార్ట్ 2 షూటింగ్ కూడా జరిగిపోతుంది. రెండు భాగాల మధ్య 6 నెలలకు మించి టైమ్ తీసుకోకూడదన్నది సుకుమార్ ఆలోచన. రెండు భాగాల మధ్య ఎక్కువ విరామం వస్తే.. క్రేజ్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. దాన్ని కూడా చిత్రబృందం దృష్టిలో పెట్టుకోబోతోంది.