ఆర్ మాధవన్ మంచి నటుడే కాదు ఒక మంచి వక్త కూడా. వివిధ వేదికల పైన ఆయన చేసిన ప్రసంగాలకి చాలా ఆదరణ ఉంది. ఈ మధ్య కాలంలో ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో ప్రసంగించాడు.
ఇక తాజాగా ఆయన కెనడా దేశంలో పర్యటిస్తున్నాడు. అందులో భాగంగానే కెనడా పార్లమెంట్ ని సందర్శించిన ఆయన అక్కడ దిగిన ఫోటోలు పోస్ట్ చేశాడు. అయితే అందులో ఒక ఆసక్తికరమైన ఫోటో కూడా ఉంది. అదే స్పీకర్ కుర్చీలో మాధవన్ కూర్చున్న ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.
కెనడాలో రాజకీయ నాయకుడుగా మారిన ఆర్ మాధవన్ అంటూ సోషల్ మీడియాలో ఆయన అభిమానులు తెగ ఆనందపడిపోతున్నారు. ఇక ఆయన అయితే ఇంతటి గౌరవం తనకి ఇచ్చినందుకు తాను ఎప్పటికి రుణ పడి ఉంటాను అని చెప్పుకొచ్చాడు.