‘నాకు అప్పుడే పెళ్ళేంటి.? కెరీర్‌లో ఇంకా చాలా ఎత్తుకి ఎదగాల్సి వుంది.. ప్రస్తుతానికైతే పెళ్ళి ఆలోచనలు లేవు..’ అని తేల్చేసింది ‘రత్తాలు’ లక్ష్మీ రాయ్. కెరీర్‌లో ఎన్ని హిట్స్ వున్నా, ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాలోని స్పెషల్ సాంగ్ ‘రత్తాలు’ కాస్తా ఆమెకి ‘స్వీట్ పెట్ నేవ్‌ు’గా మారిపోయిందంటే అది అతిశయోక్తి కాదేమో. ‘రత్తాలు’ అనే పిలుపుని తానూ ఎంజాయ్ చేస్తానంటోంది ఈ ముద్దుగుమ్మ. ‘నాకూ ప్రేమ కథలున్నాయి.. అందులో నేను హీరోయిన్ అయితే, నాకు హీరోలు చాలామందే వున్నారు. జస్ట్ అవీ సినిమా కథల్లాంటివే..’ అంటూ ఓ ఇంటర్వ్యూలో తనదైన స్టయిల్లో సమాధానమిచ్చింది లక్ష్మీరాయ్. ‘లవ్ స్టోరీస్‌లో మంచీ, చెడూ రెండూ వుంటాయ్ కదా..’ అనేసిన లక్ష్మీ రాయ్, ఆ లవ్ స్టోరీల్లోని హీరోల పేర్లు మాత్రం చెప్పలేదు.
‘అన్ని లవ్ స్టోరీస్ విజయ తీరాలకు చేరతాయని చెప్పలేం. నాకూ ఓ మంచి లవ్ స్టోరీ తప్పక వుంటుంది.. ఆ స్టోరీలో ఖచ్చితంగా గెలుస్తాను.. నాకు నచ్చినవాడితోనే నా పెళ్ళి జరుగుతుంది.. ఇప్పటికైతే అలాంటి ప్రేమ ఆలోచనలేవీ పెట్టుకోవడంలేదు..’ అని లక్ష్మీరాయ్ చెప్పుకొచ్చింది తాజాగా ఓ ఇంటర్వ్యూలో. ప్రస్తుతం అందరిలానే లక్ష్మీ రాయ్ కూడా లాక్‌డౌన్‌ని ఎంజాయ్ చేస్తోంది. తప్పదు మరి.. వేరే ఛాన్స్ లేదు గనుక, కష్టమైన ఇష్టంగా భరించాల్సిందేనని లాక్‌డౌన్ గురించి చెబుతున్న లక్ష్మీరాయ్.. లాక్‌డౌన్ ఎత్తివేశాక, తన సినిమాలు విడుదలకు సిద్ధమవుతాయని వెల్లడించింది.