హారర్, థ్రిల్లర్ల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ జోనర్‌లోనే ఓ సినిమా చేయాలని నటీనటులు ఫిక్సవ్వడంతో కొత్త కొత్త సినిమాలు తయారవుతున్నాయి. నరేష్ ఆమధ్య ఇంట్లో దెయ్యం నాకేం భయం అంటూ.. భయపెట్టే ప్రయత్నం చేశాడు. శ్రీకాంత్ `రారా` అంటూ భయపెట్టడానికి థియేటర్లకు పిలుస్తున్నాడు. ఇప్పుడు మాజీ హోమ్లీ హీరోయిన్ రాశీ కూడా హారర్ సినిమా చేస్తోంది. అదే.. 'లంక'. శ్రీముని అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం అవుతున్నాడు. సినిమా అంతా రాశీ చుట్టూనే నడుస్తుందట. గప్ చుప్‌గా షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం.. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా నిలబడాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న రాశీకి.. ఈ హారర్ సినిమా ఎంత వరకూ బ్రేక్ ఇస్తుందో చూడాలి.