ముద్దుగుమ్మ రాశీఖన్నా చేతిలో ప్రస్తుతం రెండు సినిమాల వరకూ ఉన్నాయి. ఎన్టీఆర్‌తో 'జై లవ కుశ' సినిమాలో రాశీఖన్నా ఓ హీరోయిన్ పాత్ర పోషిస్తోంది. మరో పక్క గోపీచంద్‌తో 'ఆక్సిజన్' సినిమాలోనూ నటిస్తోంది. మల్టీ టాలెంటెడ్ అయిన రాశీఖన్నాకి కెరీర్లో బెస్ట్ రోల్ ఇంకా రాలేదంటోంది. అమ్మడు చదువుల్లో సరస్వతి. అనుకోకుండా హీరోయిన్గా మారి, గ్లామర్ రంగంలోకి అడుగుపెట్టింది. సినీ రంగంలో అవకాశం దక్కాలే కానీ కాని కలల్ని కూడా నిజం చేసుకోవచ్చు అంటోంది ఈ ముద్దుగుమ్మ. అంటే నటనలో ఎలాంటి పాత్రనైనా పోషించే అవకాశం ఉంటుంది. అమ్మడు నిజ జీవితంలో కలెక్టర్ కావాలనుకుందట. కానీ కుదరలేదు. సినీ జీవితంలో ఆ కలల్ని నిజం చేసుకుంటానంటోంది. ఇప్పటికే 'సుప్రీమ్' సినిమాలో పోలీసాఫీసర్ పాత్రలో కనిపించింది. అయితే అలా కామెడీ పోలీస్ కాదంట. సీరియస్‌గా ఫైట్లు చేసే పోలీసాఫీసర్ పాత్రలో నటించాలని ఉందంటోంది. అలాగే హుందా అయిన హై అండ్ అఫీషియల్ పాత్రల్లో కూడా నటించాలని ఉందని రాశీఖన్నా అంటోంది. ప్రస్తుతం అమ్మడు తెలుగుతో పాటు, తమిళంలో కూడా పలు చిత్రాల్లో నటిస్తోంది. సో అమ్మడి కెరీర్ బిజీగానే ఉంది ప్రస్తుతం. అయితే నటనలో మరింత పరిణీతి పొందాలంటే ఎప్పటికప్పుడే కొత్త కొత్త పాత్రల్ని ఎంచుకోవాలి. అప్పుడే లోపలున్న నటిని బయటకు తీసుకు రాగలుగుతామని రాశి ఖన్నా చెబుతోంది. పోలీస్ పాత్రలంటే ఫిట్‌గా కనిపించాలి. దానికోసం ఎన్నో సాహసాలు చెయ్యాలి. బొద్దుగుమ్మ రాశి ఖన్నా మెరుపు తీగలా మారితే ఆమె కోరిక తీరడం కష్టం కాకపోవచ్చు.