షారుక్ రయీస్ మూవీ తెలుగు రివ్యూ

మరిన్ని వార్తలు

ప్రధాన తారాగణం: షారుఖ్ ఖాన్, మహిరా ఖాన్, నవాజుద్దిన్ సిద్దికి
నిర్మాతలు: రితేష్ సిధ్వాని, ఫర్హాన్ అక్తర్ మరియు గౌరీ ఖాన్
నిర్మాణ సంస్థలు: రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ మరియు ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్
రచయితలు: రాహుల్ ధోలాకియా, హరిత్ మెహ్తా, ఆశిష్ వషి మరియు నీరజ్ శుక్లా
దర్శకుడు: రాహుల్ ధోలాకియా
సంగీత దర్శకుడు: రాం సంపత్
ఛాయాగ్రహణం: కే యు మోహన్
కూర్పు: దీప భాటియా
సినిమా సమయం: 142 నిమిషాలు
భాష: హిందీ

కథ:

గుజరాత్ లోని అక్రమ మద్యం వ్యాపారాలలో ఆరితేరిన వ్యక్తి రయీస్ (షారుఖ్ ఖాన్) . జైరాజ్ (అతుల్ కులకర్ణి) దగ్గర పని చేస్తూ తర్వాత విడిపోయి విడిగా దందా చేస్కుంటూ జైరాజ్ ని మించిపోతాడు రయీస్. అదే సమయం లో ఆ ఏరియా కి కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్ ముజందార్ (నవజుద్దిన్) రయీస్ అక్రమ రవాణాలు అడ్డుకట్ట వేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అలా క్రమక్రమంగా ఎదుగుతూ వచ్చిన రయీస్ కొన్ని అనూహ్య పరిణామాల కారణంగా రాజకీయాల్లో కి రావాల్సి వస్తుంది. ఆ తర్వాత రయీస్ ఏం చేసాడు? ముజందార్ రయీస్ అక్రమాలను ఎలా అడ్డుకున్నాడు? అన్న ప్రశ్నలకు సమాధానమే మిగిలిన కథ.

నటీనటుల పనితనం:

షారుఖ్ ఖాన్ గురించి కొత్తగా చెప్పుకోవలసినది ఏమి లేదు. తను ఈ సినిమాలో కొత్తగా కనిపించే ప్రయత్నం కూడా ఏమి లేదు. తన లుక్ ను మాత్రం చాలా బాగా డిజైన్ చేసారు. ఈ చిత్రం లో షారుఖ్ నటన, హావభావాలు ప్రదర్శించిన తీరు బాగుంది. తను స్క్రీన్ పైన ఉన్నంత సేపు ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం లో విజయం పొందాడు.

మహిరా ఖాన్ ఈ చిత్రం తో తెరంగేట్రం చేసింది. కాని షారుఖ్ చిత్రాల్లో మనం సాధారణంగా ఎక్స్పెక్ట్ చేసే కథానాయిక పాత్ర కు మాత్రం తను ఏ మాత్రం న్యాయం చేయలేకపోయింది. ఈ సినిమా లో తను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.

నవాజుద్దిన్ సిద్దికి ని ఎంచుకోడం సినిమా కి పెద్ద ఎసెట్. షారుఖ్ కి దీటుగా పోటి ఇస్తూ చాలా తెలివిగా నటించాడు. తన నటన, తను సంభాషణలు పలికే విధానం అబ్బురపరుస్తాయి. షారుఖ్ తో పోటిగా నటించి నవజుద్దిన్ కూడా తన ప్రతిభ చాటుకున్నాడు.

అతుల్ కులకర్ణి, మొహమ్మద్ జీషణ్ వంటి నటులు తమ పాత్రలకు న్యాయం చేసారు.

విశ్లేషణ:

దిల్వాలే, ఫ్యాన్ లాంటి సినిమాల తర్వాత షారుఖ్ ఖాన్ నుండి వస్తున్న చిత్రం 'రయీస్'. ప్రచార చిత్రాల విడుదల నుండి సినిమా పై అంచనాలను పెంచుతూ మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ వచ్చారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రం అరకొర కథ తో కొంచెం నిరాశ నే మిగిల్చింది అని చెప్పుకోవచ్చు. ఒక క్రైమ్ థ్రిల్లర్ గా సాగే ఏ సినిమా కైనా కథ మూలం. ఆద్యంతం ఆకట్టుకొనే ఒక మంచి కథ కు మంచి కథనాన్ని జోడిస్తే విజయం తధ్యం. 'రయీస్' విషయం లో కథ లోటు అని చెప్పుకోవచ్చు, దాని వల్ల సినిమా బోరింగ్ గా సాగుతుంది. "చేసే పని చిన్నది పెద్దది అని ఉండదు" అనే ఉదేష్యాన్ని చిన్నప్పటి నుండి ఫాలో అవుతూ అక్రమ మద్యం రవాణ లో కి దిగుతాడు కథానాయకుడు. అలా అంచెలంచలుగా ఎదుగుతూ ఆ దందా ని శాసించే స్థాయి కి చేరతాడు. అతని అక్రమాలకు అడ్డుగోడ వేసే ఒక పోలీస్ ఆఫీసర్ పాత్ర లో నవజుద్దిన్ సిద్దికి కనిపిస్తారు. వీరిరువురి మధ్య సాగే 'నువ్వా-నేనా' తరహా సన్నివేశాలు తప్ప సినిమా లో పెద్దగా చెప్పుకోవాల్సిన అంశాలు ఏమి లేవు.

చిత్రం లో 'రయీస్' పాత్ర తప్ప మరే పాత్రను ఆకట్టుకొనే రీతిలో రూపుదిద్దలేదు దర్శకుడు. 'రయీస్' పాత్ర కు చేర్చిన మానేరిస్మ్స్ చివరి వరకు నిలబెట్టలేకపోయాడు దర్శకుడు. అటు పక్కన నవజుద్దిన్ పాత్ర ను ఇంకా శక్తివంతంగా తీర్చిదిద్దల్సింది దర్శకుడు కానీ అతన్ని సాధారణంగా చూపించే ప్రయత్నం చేసారు. కథ ను దర్శకుడు హ్యాండిల్ చేసిన విధానం బాగానే ఉన్నా కాని కథనాన్ని ఆసక్తి గా మలిచే విధానం లో మాత్రం దర్శకుడు ఫెయిల్ అయినట్లే చెప్పొచు. ఒక ఊహాజనిక కథను కథనం మాత్రమే నిలబెట్టగలదు కాని ఈ కథ లోప్రథమార్ధం లో పెద్దగా చెప్పుకోదగ్గ సన్నివేశాలు ఏమి లేకపోవడం తో సినిమా ఇంటర్వెల్ వరకు కథ ముందుకు సాగదు. సినిమా ద్వితీయార్ధం లో కూడా పెద్దగా చెప్పుకోదగ్గ అంశాలు ఏమి లేకపోవడం తో పతాక సన్నివేశాలు చేరే అంత వరకు కథనం వీక్ గా సాగింది. పతాక సన్నివేశాలలో కొంచెం ఇంటరెస్టింగ్ అంశాలు జోడించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరగడం తో ప్రేక్షకుడు సినిమాలో నుండి పూర్తి గా బయటకు వచ్చేస్తాడు.

నచ్చే అంశాలు:
షారుఖ్ ఖాన్ నటన
సంగీతం మరియు నేపథ్య సంగీతం
చాయగ్రహణం

నచ్చని అంశాలు:
కథ, కథనం
సినిమాలో లీనమయిపోయే అంశాలు పెద్దగా లేకపోవడం
కథానాయిక

సంగీతం:
రామ్ సంపత్ స్వరపరిచిన బాణీలు అన్ని వినసొంపుగా నే ఉన్నాయి. తను అందించిన నేపథ్య  సంగీతం చిత్రానికి ప్రాణం పోసింది అని చెప్పుకోవచ్చు. కొన్ని ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాలను నేపథ్య సంగీతం బాగా ఎలివేట్ చేసింది.

ఇతర సాంకేతిక వర్గం పనితనం:
రచయితలు రాహుల్ ధోలాకియా, హరిత్ మెహ్తా, ఆశిష్ వషి మరియు నీరజ్ శుక్లా కథను రాసిన విధానం బాగుంది. సంభాషణలు అద్బుతం గా పేలాయి. షారుఖ్ మరియు నవజుద్దిన్ మధ్య వచ్చే అన్ని సన్నివేశాల లో సంభాషణలు బాగున్నాయి. కే యు మోహన్ అందించిన ఛాయాగ్రహణం సినిమాకు ప్రధాన ఆకర్షణ. దీప భాటియా కూర్పు ఇంకా మెరుగుగా ఉంటె బాగుండేది. సినిమా నిడివి 142 నిమిషాలు అయినప్పటికీ చాలా ఎక్కువ సేపు ఉన్నట్లు గా సాగదీసినట్టు గా అనిపిస్తుంది. నిర్మాతలు రితేష్ సిధ్వాని, ఫర్హాన్ అక్తర్ మరియు గౌరీ ఖాన్ పాటించిన నిర్మాణ విలువలు అభినందనీయం.

ఐక్లిక్ తీర్పు:
రయీస్ సినిమా లో చెప్పుకోదగ్గ అంశాలు ఏమి లేవు. సాధారణ కథ, ఆకట్టుకోలేని కథనం తో చిత్రం అలా అలా ముందుకు సాగుతుంది. షారుఖ్ ఖాన్ తప్ప పెద్దగా మనోరంజకమైన అంశాలు ఏమి లేకపోవడం నిరాశజనకం. షారుఖ్ గత చిత్రాలతో పోలిస్తే మాత్రం 'రయీస్' చాలా బెటర్.

ఒక్క మాటలో: రయీస్ రాణించలేకపోయాడు!!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS