దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గత రెండు రోజుల నుండి తన పైన వస్తున్న వార్తలకి సంబంధించి వివరణ ఇచ్చారు.
అదేంటంటే- ఆయన త్వరలోనే TTD చైర్మన్ పదవికి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు అని రెండు మూడు రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిలో ఏమాత్రం కూడా నిజం లేదు అని అవి కేవలం ఒట్టి పుకార్లు మాత్రమే అని స్పష్టం చేశారు.
తాను మాత్రం ప్రస్తుతం ఎస్.వీ.ఎస్.సి ఛానల్ లో స్వామి పైన మరిన్ని కార్యక్రమాలు రూపొందించాలి అని అనుకుంటున్నట్టు తెలిపారు. అంతేతప్ప TTD చైర్మన్ వంటి పుకార్లని దయచేసి ఎవరూ నమ్మొద్దు అని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఆయన ప్రస్తుతం TTD బోర్డు సభ్యుల్లో ఒకరిగా ఉండడంతో ఈ ‘చైర్మన్ వార్తల’కి బాగా హైప్ రావడం జరిగింది. ఇక ఈ వార్త మరింత వ్యాపించక ముందే ఆయన దీనికి చెక్ పెట్టాలనే ఉద్దేశ్యంతోనే ఈ ప్రకటన విడుదల చేశారు.