అందాల రాక్షసి చిత్రంతో తెలుగులో హీరోగా పరిచయమైనా హీరో రాహుల్ రవీంద్రన్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళితే, రాహుల్ హీరో నుండి దర్శకుడిగా మారనున్నాడు. మరొక ట్విస్ట్ ఏంటంటే- రాహుల్ దర్శకత్వం వహించబోయే చిత్రంలో అక్కినేని గారి మనువడు అయిన సుశాంత్ హీరోగా నటించనున్నాడు.
ప్రస్తుతానికి ఈ చిత్రానికి సంబందించిన హీరోయిన్ కోసం అన్వేషిస్తునట్టు, ఇక రెగ్యులర్ షూటింగ్ నవంబర్ లో మొదలుకానుంది అని తమ ట్విట్టర్ ద్వారా సుశాంత్, రాహుల్ వెల్లడించారు.
ఇక రాహుల్ హీరోగా చేస్తున్న సమయంలో దర్శకుడిగా కొత్త అవతారం ఎత్తనుండడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.