మ‌రింత‌గా కూరుకుపోయిన రాజ్‌కుంద్రా

మరిన్ని వార్తలు

నీలి చిత్రాల కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్ అవ్వ‌డం బాలీవుడ్ లో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. నీల్ కుంద్రా ప్ర‌ముఖ వ్యాపార వేత్త‌.. శిల్పాశెట్టి భ‌ర్త‌. కాబ‌ట్టే... ఈ కేసుపై ఫోక‌స్ పెరిగింది. రాజ్ కుంద్రాకి చాలామంది క‌థానాయిక‌ల‌తో స‌న్నిహిత సంబంధాలున్నాయ‌ని, త్వ‌ర‌లోనే వాళ్ల పేర్లు కూడా ఈ కేసులో బ‌య‌ట‌కు రానున్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ కేసు విష‌య‌మై పోలీసులు శిల్పా శెట్టిని కూడా ప్ర‌శ్నించారు. అయితే... త‌న భ‌ర్త అమాయ‌కుడ‌ని, త‌ను నీలి చిత్రాలు తీయ‌లేద‌ని, అవి శృంగార భ‌రిత చిత్రాల‌ను భ‌ర్త‌ర‌ని వెన‌కేసుకొస్తోంది.

 

అయితే... ఈ కేసులో రాజ్ కుంద్రాకి వ్య‌తిరేకంగా పోలీసులు బ‌ల‌మైన సాక్షాధారాల్ని సేక‌రించారు. ఇప్పుడు కొత్త‌గా ఇంకొన్ని దొరికాయి. రాజ్‌కుంద్రా నివాసంలో, ఆఫీసులో, గెస్ట్ హౌస్‌లో... కొన్ని ఫుటేజుల్నిపోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో, ఆఫీసులో... రాజ్ కుంద్రా కొన్ని ర‌హ‌స్య స్థావ‌రాలు క‌ట్టాడ‌ట‌. అందులో.. డాక్యుమెంట్లు, సీడీల‌ను పోలీసులు క‌నుగొన్నార‌ని తెలుస్తోంది. రాజ్ కుంద్రాని బెయిల్ పై విడిపించ‌డానికి శిల్పాశెట్టి విప‌రీతంగా ప్ర‌య‌త్నిస్తోంది. శ‌ని, ఆదివారాలు సెల‌వులు కావ‌డంతో అది కుదర్లేదు. సోమ‌వారం.. బెయిల్ పిటీష‌న్ పై విచార‌ణ జ‌ర‌గుతోంది. ఈ కేసు నుంచి రాజ్‌కుంద్రా బ‌య‌ట‌కురావ‌డం దాదాపుగా అసాధ్య‌మ‌ని, రాజ్ తో పాటు మ‌రింత మంది అడ్డంగా బుక్ అయ్యే అవ‌కాశాలున్నాయ‌ని బాలీవుడ్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS