ఈ టైటిల్ చూసి ఏదేదో ఊహించుకోకండి.
ఈ ౩ కోట్లు అనేవి మనవాడి రెమ్యునరేషన్ కాదు, ఇది రేపు రిలీజ్ అవ్వబోతున్న కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమా శాటిలైట్ రైట్స్ కి పలికిన ధర. పాపులర్ తెలుగు ఛానల్ జెమినీ టీవీ ఈ సినిమా టెలికాస్ట్ హక్కులని కొనుగోలు చేసింది.
అయితే ఈ రేంజ్ ధర పలకడానికి కారణం ఈ సినిమా పై ఉన్న పాజిటివ్ టాక్ అని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి రేపు మంచు మనోజ్ గుంటురోడు, విజయ్ దేవరకొండ ద్వారకా సినిమాల ద్వారా తీవ్రమైన పోటీ ఉండబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ సందర్బంగా రాజ్ తరుణ్ కి మా గుడ్ లక్.