'రాజుగాడు' చిలిపి దొంగోడు

మరిన్ని వార్తలు

చిలిపి కుర్రోడు రాజ్‌తరుణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా 'రాజుగాడు'. దీపావళి సందర్భంగా ఈ సినిమా పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్‌. సంజనా రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 'ఉయ్యాలా జంపాలా' సినిమాతో తెరంగేట్రం చేసి, హ్యాట్రిక్‌ సొంతం చేసుకున్న హీరో రాజ్‌తరుణ్‌. తొలి హ్యాట్రిక్‌ తర్వాత, డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీస్‌ని ఎంచుకుంటున్నాడు. ఈ ఏడాది 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' సినిమాతో 'కిట్టుగాడు'గా కుక్కల్ని దొంగతనం చేశాడు. అదో సస్పెన్స్‌ కామెడీ సినిమా. తర్వాత 'అంధగాడు'లో అంధుడిగా నటించి ఓ రకంగా మెప్పించాడు. ఇప్పుడు 'రాజుగాడు'గా వచ్చేస్తున్నాడు. తాజాగా విడుదలైన పోస్టర్‌ చాలా ఎట్రాక్టివ్‌గా ఉంది. ఇది ఓన్లీ పోస్టర్‌లా కాకుండా కాన్సెప్ట్‌ పోస్టర్‌లా ఉంది. రాజుగాడు ఈ పోస్టర్‌లో హీరోయిన్‌తో రొమాన్స్‌ చేస్తూనే, ఆమె జేబులోని పర్స్‌ దొంగతనం చేసేస్తున్నాడు. చూడ్డానికి పోస్టర్‌ కామెడీగా అనిపించినా, కాన్సెప్ట్‌ మాత్రం అద్ధిరిపోయింది. అదే మనోడిలో ఉన్న స్పెషాలిటీ. ఏదో మాయ చేస్తుంటాడు. ఆడియన్స్‌ని అమాంతం పడేస్తుంటాడు. ఏమో ఈ సినిమాతో ఎలా మాయ చేయబోతున్నాడో కానీ, పోస్టర్‌ కాన్సెప్ట్‌ అయితే తెగ నచ్చేస్తోంది జనానికి. ముద్దుగుమ్మ అమైరా దస్తూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. అసలే హాట్‌ బ్యూటీ. అమ్మడి అందాలు సినిమాకే హైలైట్‌ కానున్నాయట. అదీ మన రాజుగాడి సంగతి .


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS