బాహుబలి 2 రిలీజ్ కి దగ్గరవుతున్న కొద్ది ఆ సినిమా పై పుఖార్ల జోరు పెరుగుతుంది.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకి వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్టుగా న్యూస్ బయటకి రావడంతో అందరు ఒక్కసారిగా బాహుబలికి మెగా టచ్ ఉండబోతున్నట్టుగా అనుకున్నారు. అయితే ఈ పుఖార్లకు తెరదించుతూ రాజమౌళి ఒక ట్వీట్ చేశాడు.
ఆ ట్వీట్ సారాంశం ప్రకారం, చిరంజీవి వాయిస్ ఓవర్ ఇస్తున్నారు అనే వార్త కేవలం పుఖారు అని తేల్చేశాడు.