కొన్నిరోజుల నుండి దర్శకుడు రాజమౌళి చేత కొన్ని ప్రత్యేకమైన డిజైన్లు అమరావతి కోసం చేయిస్తున్నారు అంటూ ప్రచారం జరుగుతున్న వేళ మొన్న చంద్రబాబు-రాజమౌళి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే ఈ వార్తల పై దర్శకుడు రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ఆయన మాటల్లో- నేను రాజధాని నిర్మాణంలో నేను కన్సల్టంట్ గా కాని, డిజైనర్ గా కాని, సూపర్ వైజర్ గా కాని నియమింపబడలేదు అని చెప్పాడు.
ఇప్పటికే లండన్ బేస్డ్ కంపెనీ ఇచ్చిన డిజైన్స్ తనకి బాగా నచ్చాయని, అదే విషయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి చెప్పాను అని అలాగే తన సూచనలు కేవలం అసెంబ్లీ భవన నిర్మాణానికి మాత్రమే అని తెలియచేశాడు.
తనవైపు నుండి ఈ చిన్న సూచనలు ఇంతటి పెద్ద ప్రాజెక్ట్ కి ఉపయోగపడడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చాడు.