జగపతిబాబు హీరోగా తెరకెక్కిన చిత్రం 'పటేల్ సర్'. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది ఈ సినిమా. ప్రోమోస్‌తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినట్లుగానే సినిమాలోనూ విషయం ఉందంటున్నారు. వాసు పరిమి ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. తొలి సినిమా అయినప్పటికీ, చాలా బాగా తెరకెక్కించారు. కథా, కథనాలను తాను అనుకున్నట్లుగా చక్కగా తెరపై ఆవిష్కరించి, ప్రేక్షకులకు స్టోరీ రీచ్ అయ్యేలా చేశారు. ప్రతీకార కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంతో జగపతిబాబు హీరోగా ఇంత గ్యాప్‌లోనూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒరిజినల్ గెటప్‌తో హీరోగా సూపర్బ్ అనే కామెంట్స్ వస్తున్నాయి. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా హుందా అయిన పాత్రల్లో సెటిలైపోయిన జగపతిబాబు ఎందుకు మళ్లీ హీరోగా అవతారమెత్తారో ఈ సినిమా చూస్తే తెలుస్తోంది. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్‌గా జగపతిబాబు నటన అందర్నీ ఆకట్టుకుంటోంది. యాక్షన్ అంశాలు అదరగొట్టేలా ఉన్నాయి ఈ సినిమాలో. అందుకే యాక్షన్ అంటే ఎంతో ఇష్టమైన డైరెక్టర్ రాజమౌళి మెప్పు పొందింది ఈ సినిమా. 'బాహుబలి' సినిమాతో యూనివర్సల్ డైరెక్టర్ అయిపోయిన రాజమౌళి ఈ సినిమాని చూసి జగపతిబాబుపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. జగపతిబాబు ఫిజిక్‌కి తగ్గ సినిమా ఇది.. చాలా బావుందంటూ జక్కన్న జగ్గూభాయ్‌ని ప్రశంసించారు. అన్నట్లు ఇదేమీ ఓన్లీ యాక్షన్ మూవీ కాదండోయ్, చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కూడా.