బోర్ కొట్టిస్తున్న రాజ‌మౌళి

మరిన్ని వార్తలు

ఆర్‌.ఆర్‌.ఆర్ ప్ర‌మోష‌న్లు ఫుల్ స్వింగ్ లో సాగుతున్నాయి. విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ... ప్ర‌మోష‌న్ల స్పీడు పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఈసారి ఆర్‌.ఆర్‌.ఆర్ టీమ్ వీడియో ఇంట‌ర్వ్యూల‌పై దృష్టి పెట్టింది. ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌, రాజ‌మౌళి క‌లిసి త‌మ‌లో తాము మాట్లాడుకుని, ఓ ఇంట‌ర్వ్యూలా విడుద‌ల చేశారు. ఆ త‌ర‌వాత‌.. ఈ ముగ్గురితో సుమ చిట్ చాట్ చేసింది. ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల‌తో కీర‌వాణి మాట్లాడారు. ఆ త‌ర‌వా సందీప్ రెడ్డి వంగా..తో రాజ‌మౌళి మాట్లాడారు. ఆ వీడియో కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇప్పుడు ఆర్‌.ఆర్‌.ఆర్ (రాజ‌మౌళి, రామారావు, రామ్ చ‌ర‌ణ్‌)ల‌కు మ‌రో `ఆర్‌`... రానా తోడ‌య్యాడు. ఈ న‌లుగురి ఇంట‌ర్వ్యూ ఇప్పుడు వ‌దిలారు. ఓ సినిమాకి సంబంధించిన ఇన్ని ర‌కాల వీడియో ఇంట‌ర్వ్యూలు, అది కూడా ర‌క‌ర‌కాల సెల‌బ్రెటీల‌తో రావ‌డం... ఇదే తొలిసారి. ఆ ర‌కంగా ఆర్‌.ఆర్‌.ఆర్ మ‌రో రికార్డ్ సృష్టించిన‌ట్టే. నిజానికి మ‌హేష్ తో కూడా ఇలాంటి చిట్ చాట్ పోగ్రాం ఒక‌టి ప్లాన్ చేశారు. కానీ అదెందుకో కుద‌ర్లేదు. బ‌హుశా.. ఈ సినిమా రిలీజ్ త‌ర‌వాత ఉండొచ్చేమో..?

 

ఒక్కో ఇంట‌ర్వ్యూని ఒక్కోలా ప్లాన్ చేశారు రాజమౌళి. సుమ‌తో చిట్ చాట్... ట్రోలింగుల‌పై స‌ర‌దాగా న‌డిచింది. కీర‌వాణి తో మాటా మంతీ.. సంగీతం, పాట‌ల చుట్టూ తిరిగింది. సందీప్ రెడ్డి వంగాతో `డైరెక్ట‌ర్ ట‌చ్‌` క‌నిపించింది. ఇలా వేటిక‌వే. కాక‌పోతే.. ప్ర‌తీ ఇంట‌ర్వ్యూలోనూ ఈ ముగ్గురే క‌నిపించ‌డం, ఒక‌ర్ని మ‌రొక‌రు పొగుడు కోవ‌డం.. ఇదే ప‌రంప‌ర‌. మేట‌ర్ వేరైనా, క‌నిపించేది ఈ ముగ్గురే కాబ‌ట్టి... వీక్ష‌కుల‌కు బోర్ కొట్టేసింది. మ‌రి చెప్పిందే చెప్పి, రాజ‌మౌళి, చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల‌కు ఎంత బోర్ కొట్టిందో..?

 

నిజానికి ఆర్‌.ఆర్‌.ఆర్ లో వీళ్లే కాదు. చాలామంది స్టార్లు ఉన్నారు. అజ‌య్ దేవ‌గ‌ణ్ ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక్క చిట్ చాట్ లోనూ క‌నిపించ‌లేదు. అలియా భ‌ట్ స‌రేస‌రి. విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఏమైపోయారో తెలీదు. బుర్రా సాయిమాధ‌వ్ గురించి కూడా ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. మ‌రి వీళ్ల‌తో ప్ర‌మోష‌న్లు ఎప్పుడు చేస్తారో?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS