కల్కి తరవాత.. రాజశేఖర్ నుంచి మరో సినిమా రాలేదు. ఆయన చాలా కాలం గ్యాప్ తీసుకున్నారు. అయితే.. 2021లో మాత్రం ఆయన్నుంచి రెండు సినిమాలు రానున్నాయి. ఇటీవలే `శేఖర్` అనే కొత్త సినిమా ప్రకటించారు రాజశేఖర్. ఇప్పుడు మరో సినిమాకి సంబంధించిన ప్రకటన వచ్చేసింది.
`గతం` అనే ఓ చిన్న చిత్రంతో ఆకట్టుకున్న దర్శకుడు కిరణ్. ఓ టీ టీలో విడుదలైన ఈ థ్రిల్లర్‌కి మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడు రాజశేఖర్‌కి ఓ కథ చెప్పి ఒప్పించాడు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. రాజశేఖర్ 92వ సినిమా ఇది. కథంతా సెక్స్ రాకెట్, అమ్మాయిల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుందని టాక్. షూటింగ్ దాదాపుగా విదేశాల్లోనే జరగబోతోంది. ఈ యేడాదే ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.