ఏడు పదులు వయసులో కూడా సూపర్ స్టార్ రజినీ కాంత్ వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు. జైలర్ తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న రజనీ ప్రస్తుతం 'వేట్టయాన్' మూవీతో దసరాకి సందడి చేయనున్నారు. ఈ మధ్య కొన్ని హెల్త్ ఇష్యూస్ కారణంగా చెన్నై అపోలో లో జాయిన్ అయ్యి, ట్రీట్ మెంట్ తీసుకుని కోలుకుని డిస్చార్జ్ అయ్యారు. రజనీ కాంత్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. నెక్స్ట్ లోకేష్ కనక రాజ్ దర్శకత్వంలో 'కూలి' అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ పూర్తి కావచ్చిందని సమాచారం. 2025 వేసవి సెలవలకి 'కూలి' రిలీజ్ కానుంది. ఈ మూవీలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో కనిపిస్తున్నారు.
ఇప్పటికే నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో "జైలర్ 2" సినిమా కూడా ఒప్పుకున్నారు. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. జైలర్ మూవీ రజినీకాంత్ యాక్టింగ్, ఫైట్స్, ట్విస్ట్ లతో అలరించింది. దీనితో జైలర్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇవన్నీ కాకుండా రజనీ కాంత్ ఇంకో కొత్త ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. కోలీవుడ్ స్టార్ డైరక్టర్ మణిరత్నంతో రజనీ ఒక ప్రాజెక్ట్ చేయనున్నారని సమాచారం. ఈ మధ్య రజనీ కాంత్ సీనియర్ దర్శకులతో వర్క్ చేయటానికి ఇష్టపడటం లేదు, అందుకే అంతా కొత్తవారితోను, యువ దర్శకులతో సినిమాలు చేస్తున్నారని అనుకుంటున్న టైంలో మణిరత్నంతో ఒక సినిమాకి ఓకే చెప్పారు తలైవా.
1991 లో వీరి కాంబోలో 'దళపతి' మూవీ వచ్చింది. 33 ఏళ్ళ తరవాత మళ్ళీ ఇన్నాళ్ళకి వీరి కాంబోలో సినిమా అంటే ఆడియన్స్ వండరవుతున్నారు. ఇప్పటికే కథా చర్చలు జరిగినట్లు, రజినీకాంత్ పుట్టినరోజుని పురస్కరించుకుని డిసెంబర్ 12న ఈ సినిమా పూజా కార్య క్రమాలు జరపవచ్చు అని తెలుస్తోంది. ఏఆర్ రహ్మాన్ సంగీతం అందించనున్నారని సమాచారం. ఇద్దరు లెజెండ్స్ కలిసి వర్క్ చేస్తుండటంతో పాన్-ఇండియా స్థాయిలో భారీ హైపు ఏర్పడుతోంది.