సూపర్ స్టార్ రజినీకాంత్ అస్వస్థత కు గురయ్యారు. తీవ్రమైన కడుపు నొప్పితో సోమవారం రాత్రి చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో చేరారు. ఇది విన్న రజనీ కాంత్ ఫాన్స్ కంగారు పడుతున్నారు. తమ హీరోకి ఏం కాకూడదని, తొందరగా కోలుకొని, తిరిగి షూటింగ్స్ లో పాల్గోవలంటూ ఫాన్స్ దేవుడ్ని ప్రార్దిస్తున్నారు. ఫాన్స్ ఆందోళనని గమనించిన రజనీ సన్నిహితులు ఆయన ఆరోగ్యం పై అప్డేట్ ఇస్తున్నారు. రజనీ ఆరోగ్యం ప్రస్తుతం కుదురుగానే ఉందని, ప్రమాదం ఏం లేదని తెలిపారు.
రజినీకాంత్ కి ప్రత్యేకంగా ఏం సమస్యలు రాలేదని, రెగ్యులర్ చెకప్ ల కోసమే, ముందుగానే ప్లాన్ చేసుకుని హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్టు, హార్ట్ సంబంధిత టెస్ట్ లు, జనరల్ బాడీ చెకప్ మొత్తం చేయించుకోవాలని హాస్పటల్ లో అడ్మిట్ అయినట్టు రజనీ ఆప్తులు తెలిపారు. ప్రజంట్ రజనీ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపినట్లు, ఫాన్స్ కంగారు పడాల్సిన అవసరం లేదని వారు తెలిపారు. రజనీ ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిసి ఫాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. రజనీ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా రెస్పాండ్ అయితే ఇంకా క్లారిటీగా ఉండేదని ఫాన్స్ ఆశపడుతున్నారు.
రజనీ సినిమాల విషయానికి వస్తే దసరాకి 'వేట్టాయన్' తో రానున్నారు. దసరా బరిలో దిగుతున్న సినిమాల్లో ఇదే పెద్దది. ఈ మూవీ అక్టోబరు 10న థియేర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నెక్స్ట్ రజనీ కాంత్, లోకేష్ కనక రాజ్ దర్శకత్వంలో 'కూలి' మూవీ చేస్తున్నారు. ఈ మూవీలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు.