సూపర్ స్టార్ రజనీకాంత్ అనారోగ్యం పాలయ్యారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టు సమాచారం. కొన్ని రోజులుగా ఆయన జ్వరంతో బాధ పడుతున్నారని, దాంతో.. ఆసుపత్రిలో చేర్చాల్సివచ్చిందని తెలుస్తోంది. ఇది కేవలం వైరల్ ఫీవర్ అని, కరోనా లక్షణాలేం లేవని ఆసుపత్రి వర్గాలు వెల్లడించినట్టు తెలుస్తోంది.
త్వరలోనే ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశాలున్నాయి. కొంతకాలంగా రజనీ ఆరోగ్యం అంతంత మాత్రమే ఉంటోంది. ఇటీవల ఆయన విదేశాలకు వెళ్లి, చికిత్స చేయించుకొచ్చారు. అయినా అప్పుడప్పుడూ.. ఏదో ఓ ఇబ్బంది తలెత్తుతోంది. రజనీ రాజకీయ రంగ ప్రవేశం ఆలస్యం అవ్వడానికి కారణం కూడా ఆయన ఆరోగ్య సమస్యలే. రజనీ ఆరోగ్యంపై తమిళ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. దాంతో.. రజనీ అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కంగారు పడాల్సిందేం లేదని, రజనీ త్వరలోనే కోలుకుంటారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.