ఇప్పుడు తమిళనాట ఎవరు సినిమా స్టార్స్ ఎవరు రాజకీయ నాయకులు అని చెప్పడం చాలా కష్టంగా ఉంది. దీనికి కారణం- తమిళనాట ఉన్న ఇద్దరు సూపర్ స్టార్స్- రజినీకాంత్ & కమల్ హసన్ ఇప్పుడు క్రీయాశీలక రాజకీయాల్లోకి వచ్చేశారు.
దీనితో రాజకీయం-సినిమా రెండు పూర్తిగా కలిసిపోయాయి. ఇక ఈ తరుణంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ ఒక కూటమిగా ఏర్పడబోతున్నట్టు ఇప్పుడు తమిళనాట వినిపిస్తున్న టాక్. ఎందుకంటే- ఈ ఇద్దరికీ తమిళనాడులో ఉన్న ఫాలోయింగ్ అనన్యసామాన్యం కాబట్టి ఈ ఇద్దరూ కలిస్తే తప్పక ఈ కూటమికి విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి అన్నది సారాంశం.
దీని పైన రజినీకాంత్ కూడా సమయం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి అని అనడంతో ఈ కూటమి పైన అందరికీ ఆశలు చిగురిస్తున్నాయి. వీరు నిజంగానే గనుక కలిస్తే తమిళనాడులో ఉన్న రెండు బలమైన రాజకీయ పార్టీలకి గడ్డుకాలం తప్పదు అని అక్కడి రాజకీయ విశ్లేషకుల అంచనా.
మరి ఎమోషనల్ గా ఉండే రజినీకాంత్ కి, ప్రాక్టికల్ గా ఉండే కమల్ హసన్ కి మధ్య రాజకీయంగా సఖ్యత కుదురుతుందా లేదా అనేది వేచి చూడాలి.