సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా తన అభిమానులతో స్వయంగా కలుస్తున్నారు, ఈ కార్యక్రమం గత మూడు రోజుల నుండి కొనసాగుతూనే ఉంది. ఇక ఈ ‘ఫ్యాన్స్ మీట్’ ఇంకొక రెండు రోజుల్లో ముగియనుంది.
అయితే ఈ మీట్ ఆఖరి రోజు అయిన డిసెంబర్ 31న ఆయన రాజకీయాల్లోకి వచ్చేది రానిది తేల్చి చెప్తాను అని ఇప్పటికే ప్రకటించారు. మరి ఆయన రాజకీయాల్లోకి అడుగు పెడతాడా లేదా అన్నది తెలుసుకోవడానికి ఆయన అభిమానులు డిసెంబర్ 31 కోసం ఎదురు చూస్తున్నారు.
ఇదిలావుండగా ఆయన రాజకీయాల్లోకి వస్తే పరిస్థితులు ఎలా మారుతాయి అన్న నేపధ్యంలో తమిళ నాట రాజకీయ నాయకులు అంచనాలు వేస్తున్నారు. మరి కనీసం ఇప్పటికైనా రజినీకాంత్ తన రాజకీయ ఎంట్రీ గురించిన స్పష్టత ఇస్తాడో లేదో అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది.
ఏదేమైనా ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది..