హారర్ కామెడీల ట్రెండ్ నడుస్తున్న నేపధ్యంలో అదే కోవలో మనముందుకి రాబోతున్న చిత్రం రాజు గారి గది 2. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకుల్లో అంచనాలని భారీగా పెంచేసింది.
వచ్చే వారం అక్టోబర్ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి దర్శక-నిర్మాతలు ముహూర్తం ఖాయం చేశారు. ఇక సెన్సార్ విషయానికి వస్తే, రాజు గారి గది 2కి బోర్డు U/A ఇవ్వడం’ జరిగింది. దీనితో ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ రావడానికి మార్గం సుగుమమైంది.
ఇక సమంతా అక్కినేని వారింటి కోడలు అయ్యాక మామ-కోడలు (నాగార్జున-సమంతా) చేసిన ఈ చిత్రం విడుదల అవ్వనుండడం కూడా ఈ చిత్రానికి మరొక అదనపు ఆకర్షణ అని చెప్పొచ్చు.
ఇది ఒకరకంగా అక్కినేని వారి ఇంటి చిత్రంగా కూడా చెప్పుకోవచ్చు.