బాబుకి హిట్ వచ్చిందట.. కాని డబ్బులు మాత్రం రాలేదట..!

మరిన్ని వార్తలు

కొన్ని సినిమాలు రివ్యూల ప్రకారం చెత్తగా ఓ మోస్తారుగా ఉంటాయి.. అందరూ ఆ సినిమా పని అయిపోయింది అనుకుంటారు, కాని సినిమాకొచ్చే కలెక్షన్లు ఊహించని విధంగా ఉంటాయి. ఇలాంటివి ఎక్కువగా మన తెలుగులోనే జరుగుతుంటాయి.. మరికొన్ని చిత్రాలు అద్భుతమైన స్పందన సంపాదించుకుంటాయి అందరూ పాజిటివ్ రివ్యూలు ఇస్తారు, కానీ బాక్సాఫీస్ విషయానికి వచ్చేసరికి అంత రివర్స్ లో జరుగుతుంటుంది.

ఇప్పుడు 'రాక్షసుడు' చిత్రానికి కూడా అదే జరుగుతుంది.'బెల్లంకొండ సాయి శ్రీనివాస్' నటించిన తాజా చిత్రం 'రాక్షసుడు'...రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళ్ 'రాత్ససన్' చిత్రానికి రీమేక్. కానీ అన్ని డిపార్ట్మెంట్లలో శ్రద్ధ వహించి నూటికి నూరు శాతం న్యాయం చేసారని చూసిన ప్రతివారు చెప్పిన మాట. బెల్లం కొండ నటన, రమేష్ వర్మ దర్శకత్వం, కథా కథనం ఇలా అన్నిటికి మంచి స్పందన లభించింది. కానీ చిత్రం విడుదలై మొదటి వారం పూర్తి చేసుకునేసరికి కలెక్షన్స్ అంతంత మాత్రంగానే వచ్చాయి.

మొదటి రోజు మినహా మిగిలిన 5 రోజులు వచ్చిన కలెక్షన్స్ తక్కువే అని చెప్పుకోవాలి. ప్రీ రిలీజ్ బిజినెస్ తో కలిపి మొత్తంగా మొదటి వారం 14 కోట్లు సంపాదించింది రాక్షసుడు. ఇకపోతే నిన్న విడుదలైన 'మన్మధుడు 2' చిత్రానికి నెగటివ్ టాక్ రావడం వల్ల...ఇక మీదనైనా బాక్సాఫీస్ దగ్గర పుంజుకుంటుందో లేదో ఇంకో వారం వేచి చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS