సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య అటు తిరిగి, ఇటు తిరిగి డ్రగ్స్ మాఫియాపై పడింది. డ్రగ్స్ కొనుగోలు కేసులో రియా అరెస్ట్ అవ్వడం, తాను మరో 25మంది సెలబ్రెటీల పేర్లు బయటపెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఆ 25మందిలో రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నట్టు సమాచారం అందుతోంది. దాంతో... టాలీవుడ్ లోనూ కలకలం బయల్దేరింది. రియా చక్రవర్తి పేర్కొన్న 25మంది సెలబ్రెటీలపైనా నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. వాళ్ల కాల్స్ లిస్టుని బయటకు తీస్తున్నట్టు సమాచారం.
నిజంగా ఈ 25మందికీ డ్రగ్స్ కేసుతో సంబంధం ఉందా? లేదంటే ఈ కేసుని తప్పుదోవ పట్టించడానికే రియా వాళ్ల పేర్లు చెబుతోందా? అనే కోణంలోనూ అధికారులు విచారిస్తున్నారు. ఈ జాబితాలో రకుల్‌నే కాదు... టాలీవుడ్ తో అనుబంధం ఉన్న మరో ఇద్దరు ముగ్గురి పేర్లు కూడా ఉన్నట్టు భోగట్టా. మరి.. వాళ్లలో నిజంగానే డ్రగ్స్ అలవాటు ఎవరికి ఉందో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.