రకుల్‌కి నచ్చని మాటలవే!

మరిన్ని వార్తలు

చిన్న సినిమా, పెద్ద సినిమా అనేవి ప్రత్యేకించి ఉండవంటోంది ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. సక్సెస్‌ని బట్టే ఆ సినిమా చిన్నదా, పెద్దదా అనేది ఉంటుంది. కానీ బడ్జెట్‌ని బట్టి కాదని కొత్త లెక్క చెబుతోంది స్మైలీ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. అలాగే రెమ్యునరేషన్‌ గురించి కూడా అస్సలు ఆలోచించదట రకుల్‌. ఆ విషయం నిర్మాతలే చూసుకుంటారు. వాళ్లకే తెలుసు నాకు ఎంత రెమ్యునరేషన్‌ ఇవ్వాలో. అలాగే ఇక స్టార్‌డమ్‌ అంటారా అది ప్రేక్షకులు చూసుకుంటారు అంటోంది రకుల్‌. 'రారండోయ్‌ వేడుక చూద్దాం' సినిమాతో భ్రమరాంబగా అలరిస్తోంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఈ నేపథ్యంలో స్టార్‌డమ్‌, రెమ్యునరేషన్‌ గురించి రకుల్‌ దగ్గర ప్రస్థావిస్తే, ఇదిగో ఇలా ఘాటుగా స్పందించింది. రెమ్యునరేషన్‌, స్టార్‌డమ్‌ ఇలాంటి ప్రశ్నలు తనకి నచ్చవనీ ఖచ్చితంగా చెప్పేసింది. ఏ విషయాన్ని అయినా కుండ బద్దలుకొట్టినట్లు చెప్పడమే రకుల్‌కి అలవాటు. అంతేకాదు ఆమెకు ప్రతీ విషయం పైనా అవగాహన ఉంటుంది. అవగాహన లేకుండా ఆమె ఏ మాట మాట్లాడదట కూడా. అందులోనూ 'రారండోయ్‌..' సినిమాతో రకుల్‌ మరీ రాటు దేలింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఘాటుగా, సూటిగా సమాధానం చెబుతూనే క్యూట్‌గా ఎట్రాక్ట్‌ చేస్తోంది. ఒక పక్క స్టార్‌ హీరోస్‌తో సినిమాలు చేస్తూనే, మరో పక్క యంగ్‌ హీరోస్‌తోనూ నటించేస్తోంది ఈ ముద్దుగుమ్మ. వామ్మో మళ్లీ అదే..వద్దంటోంది రకుల్‌. స్టార్‌ హీరోలు అని నా దృష్టిలో ఎవ్వరూ ఉండరంటోంది. ప్రేక్షకులకు నచ్చితే ఆ సినిమా చిన్న సినిమా అయినా కానీ ప్రేక్షకుల్ని మెప్పించింది కాబట్టి, స్టార్‌ సినిమా వేల్యూనే దక్కుతుందంటోంది. రకుల్‌ చెప్పింది కదా వినేస్తే పోలా!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS