‘ఆడు కనబడితే నిప్పు కణం నిలబడినట్లుంటది.. కలబడితే యేగు సుక్క ఎగబడినట్లుంటది.. ఎదురు పడితే సావుకైనా సెమట ధార కడతది.. ఇంటి పేరు అల్లూరి, సాకింది గోదారి.. నా అన్న మన్నెం దొర అల్లూరి సీతారామరాజు..’ అంటూ తన సొంత వాయిస్‌తో ప్రిపేర్ అయిన వీడియోని రిలీజ్ చేసేశాడు ఎన్టీఆర్. ‘ఆర్‌ఆర్‌ఆర్’ నుండి రిలీజైన ది బెస్ట్ సర్‌ప్రైజ్ ఇది. చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్, తన అన్న చరణ్‌కిచ్చిన బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది. నిజానికి ఈ రోజు ఉదయమే రావల్సింది. టెక్నికల్ రీజన్స్‌తో కాస్త లేట్ అయ్యింది. లేట్ అయినా వెరీ వెరీ లేటెస్ట్‌గా, ఫ్యాన్స్‌కి ది బెస్ట్ మెమరీలా చరణ్ ఎంట్రీని ప్లాన్ చేశారు ఎన్టీఆర్ అండ్ జక్కన్న.
ఓ హీరో క్యారెక్టర్‌కి ఇంతకన్నా బెస్ట్ ఇంట్రడక్షన్ ఇంకేముంటుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’.. సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతోందో ఈ ఒక్క ఎంట్రీతో అర్ధమైపోతోంది. భళా అనిపించేలా మరోసారి కీరవాణి తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసేశాడు. ఎన్టీఆర్ బేస్ వాయిస్ వెంట్రుకలు నిక్కబొడుచుకునేలా చేస్తోంది. విజువల్‌లో జక్కన్న అండ్ టీమ్ కష్టమంతా కనిపిస్తోంది. ఇక చరణ్ విషయానికి వస్తే, మరోసారి ఫిజిక్‌తో విశ్వరూపం చూపించేశాడు. ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఎంత చూసినా తనివి తీరదే.. అనేలా ఉందీ వీడియో. ఆలస్యం చేయకుండా ఏ దిక్కులు చూడకుండా ఫస్ట్ ఈ వీడియో చూసెయ్యండీ. ఇంట్లోనే ఎంజాయ్ చెయ్యండి.