‘జాను’ని మెచ్చిన మెగా పవర్ స్టార్.!

మరిన్ని వార్తలు

శర్వానంద్‌ ` సమంత జంటగా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘జాను’. డిఫరెంట్‌ వ్‌ స్టోరీగా రూపొందిన ఈ చిత్రం తమిళ బ్లాక్‌ బస్టర్‌ ‘96’కి రీమేక్‌గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఎంతో ఇష్టపడి ఈ సినిమాని తెలుగులోకి తీసుకొచ్చారు. ఆయన ఇష్టపడ్డట్లే, ప్రేక్షకుూ ఈ సినిమాని బాగా మెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ‘జాను’ సినిమాపై స్పెషల్‌ ట్వీట్‌ వేశారు. లేటెస్ట్‌గా సినిమాని చూసిన రామ్‌చరణ్‌ ట్విట్టర్‌లో తన రెస్పాన్స్‌ తెలిపారు. ‘ప్రేక్షకులు మెచ్చుకున్న సినిమాల్ని రీమేక్‌ చేయడం అంత ఆషామాషీ విషయం కాదు, కానీ, ‘జాను’ సినిమా తొగులో మంచి విజయం అందుకుంది.

 

శర్వానంద్‌, సమంత చాలా బాగా నటించారు.. శర్వానంద్‌కీ, సమంతకీ, డైరెక్టర్‌కీ, ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజుకీ శుభాకాంక్షలు.. అంటూ ట్వీట్‌ చేశాడు. రీమేక్‌ పెయిన్‌ ఎలా ఉంటుందో రామ్‌చరణ్‌కి బాగా తొసు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘తనీఒరువన్‌’ చిత్రం ‘ధృవ’ పేరుతో రామ్‌చరణ్‌ హీరోగా తెలుగులో రీమేక్‌ అయిన సంగతి తెలిసిందే. తెలుగులోనూ ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇలా కొన్ని క్లాసిక్స్‌ని టచ్‌ చేసేటప్పుడు చాలా భయమేస్తుంది. రిజల్ట్‌ ఆశించినట్లుగా వస్తేనే ఆ భయం నుండి విముక్తి లభిస్తుంది. ఆ పెయిన్‌ తెలిసిన వాడు కాబట్టే ‘జాను’ విషయంలో తన స్నేహితుడు శర్వానంద్‌కీ, కో స్టార్‌ సమంతకు సపోర్ట్‌గా నిలిచాడు రామ్‌చరణ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS