ఏ స్టార్‌కైనా అభిమానులే బలం. వాళ్లే కొన్నిసార్లు బలహీనత కూడా. కొన్నిసార్లు అభిమానుల అత్యుత్సాహం హీరోలకు తలనొప్పి తీసుకొస్తుంటుంది. పవన్ ఫ్యాన్స్ పై కూడా ఈ అభియోగం ఉంది. ఫంక్షన్ ఎవరిదైనా సరే.. `పవర్ స్టార్..` పేరు తీసుకురావడం, హీరోలు, హీరోయిన్లు... మాట్లాడుతున్నప్పుడు వాళ్ల మాటకు అడ్డురావడం ... ఇదంతా కామన్ అయిపోయిన వ్యవహారం. స్టేజీపై చాలామంది స్టార్ హీరోలకు ఇదే తలనొప్పి తెప్పించింది. ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా అలానే తయారయ్యారేమో అనిపిస్తోంది.
కీర్తి సురేష్ నటించిన `గుడ్ లక్ సఖీ` ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి రామ్ చరణ్ గెస్ట్ గా హాజరయ్యాడు. దాంతో ఈ ఫంక్షన్‌కి మెగాఫ్యాన్స్ జాతరలా వచ్చారు. స్టేజీపై ఎవరు మాట్లాడుతున్నా `జై చరణ్.. జై జై చరణ్` అంటూ స్లోగన్స్ తో హోరెత్తించేశారు. ముఖ్యంగా కీర్తి సురేష్స్టేజీపై ఉన్నప్పుడు తనని అస్సలు మాట్లాడనివ్వలేదు. చివరికి.. కీర్తి కూడా `జై చరణ్.. జై జై చరణ్` అని చెయెత్తి జై కొట్టింది. చరణ్ ఫంక్షన్లో .. చరణ్ ఫ్యాన్స్ గోల చేశారంటే ఓ అర్థం ఉంది. ఇలాంటి చోట... ఇలా అల్లరి చేస్తే, ఆ తరవాత ఆ నింద చరణే మోయాల్సివస్తుంది. ఈ విషయంలో చరణ్ ఇప్పటి నుంచే తన ఫ్యాన్స్‌ని కంట్రోల్ చేయాలి. లేదంటే.... శ్రుతి మించిపోతే.. ఆ తరవాత దాన్ని ఆపడం చాలా కష్టం.