గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పాన్ ఇండియా మూవీ 'గేమ్ చేంజర్' సంక్రాంతి సందర్భంగా జనవరి 10 న రిలీజ్ అయ్యింది. ఫస్ట్ షోకి పాజిటీవ్ టాక్ వచ్చినా, రాను రాను మిక్స్డ్ టాక్ వచ్చింది. తరవాత కొందరు కుట్రతో పైరసీని లీక్ చేసారు. ఇంకొందరు సొషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. వీటన్నిటి వలన గేమ్ చేంజర్ కలక్షన్లు తగ్గాయి. HD ప్రింట్ నెట్ లో మరుసటి రోజే లీక్ అవటం, అదే ప్రింట్ లోకల్ టీవీలో, ప్రయివైటు బస్ లలో టెలికాస్ట్ అవడం మూవీ టీమ్ కి షాకిచ్చింది.
AP లో ఏపీ లోకల్ టీవీ పేరుతో ఒక కేబుల్ నెట్వర్క్ లో సంక్రాంతి రోజు 'గేమ్ చేంజర్' షో వేశారు. థియేటర్లలో చూడాల్సిన సినిమా ఇంట్లోనే టీవీల్లో ఫ్రీగా చూసారు ప్రేక్షకులు. దీనితో మెగా ఫాన్స్ కొత్త సినిమా టీవీలో వేయటాన్ని తప్పు పట్టారు. థియేటర్స్ లో చూడాలనుకున్న సినిమా ఇంట్లో టీవీల్లో చూసేసి ఇంకెవరు థియేటర్స్ కి వెళ్లరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ లను ట్యాగ్ చేస్తూ 'గేమ్ చేంజర్' టెలికాస్ట్ అయిన విజువల్స్ ఫోటోలు తీసి సొషల్ మీడియాలో కంప్లైంట్ చేశారు. ఆ టీవీ ఛానల్ మీద చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మూవీ నిర్మాతలు కూడా విశాఖ కమీషనర్ కి కంప్లైంట్ చేసారు.
ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఏపీ సర్కార్ దీనిపై వెంటనే చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఏపీ లోకల్ టీవీ యజమాని అప్పలరాజుని అరెస్ట్ చేసారు. మేనేజింగ్ డైరెక్టర్ హెచ్.వి.చలపతిరాజు అండ్ టీంతో పాటు గాజువాక పోలీస్ అండ్ క్రైమ్ క్లూస్ టీమ్ అప్పలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏపీ లోకల్ టీవీపై దాడులు నిర్వహించింది. గేమ్ ఛేంజర్ తెలుగు సినిమా పైరసీ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు. అక్కడ దొరికిన పైరసీ టెక్నాలజీని సీజ్ చేసారు. అప్పలరాజు పై FIR ఫైల్ చేసి అరెస్టు చేశారు.