Ram Charan: అన్‌స్టాప‌బుల్ లో రామ్ చ‌ర‌ణ్‌..

మరిన్ని వార్తలు

ఆహాలో అన్ స్టాప‌బుల్ షో.. దూసుకుపోతోంది. సీజ‌న్ 1 సూప‌ర్ హిట్ట‌వ్వ‌డంతో, సీజ‌న్ 2 కి అంకురార్ప‌ణ చేశారు. సీజ‌న్ 2 కాస్త స్లోగా స్టార్ట్ అయినా.. ఇప్పుడు అనూహ్య‌మైన వ్యూవ‌ర్ షిప్‌ల‌తో రికార్డులు సృష్టిస్తోంది. త్వ‌ర‌లో ప్ర‌భాస్ - గోపీచంద్ ల తో బాల‌య్య చిట్ చాట్ చేయ‌బోతున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. అయితే ఇదే షోలో రామ్ చ‌ర‌ణ్ కూడా క‌నిపించ‌నున్నాడు. అయితే.. అది వీడియో కాల్ లో.

 

ప్ర‌భాస్ చ‌ర‌ణ్‌కి వీడియో కాల్ చేయ‌డం, ఆ కాల్ లో చ‌ర‌ణ్ - ప్ర‌భాస్ ల మ‌ధ్య చిట్ చాట్ జ‌ర‌గ‌డం.. ఈ షోకి హైలెట్ అని స‌మాచారం. అలా అన్‌స్టాప‌బుల్ లో రామ్ చ‌ర‌ణ్ ఎంట్రీ కూడా ఇచ్చేసిన‌ట్టే అనుకోవాలి. చిరు - చ‌ర‌ణ్‌ల‌ను అన్ స్టాప‌బుల్ కి తీసుకురావాల‌ని ఆహా టీమ్ భావిస్తోంది. అలానే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ - త్రివిక్ర‌మ్ ల కాంబో కూడా చ‌ర్చ‌ల్లో ఉంది. ఈ రెండింటిలో ఓ కాంబో అయితే ఖాయ‌మ‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. సీజ‌న్ 2కి ఆ షోతోనే గ్రాండ్ గా ముగింపు ప‌ల‌కాల‌ని భావిస్తున్నార్ట‌. చూద్దాం.. ఏ కాంబోతో.. సీజ‌న్ 2కి శుభం కార్డు వేస్తారో..?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS