'ఆర్‌ఆర్‌ఆర్‌' తర్వాత చెర్రీ సినిమా అదేనా.?

మరిన్ని వార్తలు

పవన్‌ కళ్యాణ్‌ సినిమాల ఎంట్రీ విషయమై ఆయన నుండి అధికారిక క్లారిటీ రాలేదు. కానీ, వార్తలు మాత్రం ఎప్పటికప్పుడే తాజా తాజాగా గుప్పుమంటున్నాయి. 'పింక్‌' రీమేక్‌తో పవన్‌ కళ్యాణ్‌ రీ ఎంట్రీ ఉంటుందని భావిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్‌ రన్నింగ్‌లోనే ఉంది. బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌తో కలిసి దిల్‌రాజు ఈ సినిమాని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అంజలి, నివేదా థామస్‌ హీరోయిన్లుగా ఎంపికయ్యారు కూడా. మెయిన్‌ లీడ్‌ హీరోయిన్‌, పవన్‌ కళ్యాణ్‌ పాత్ర విషయంలోనే అధికారిక ప్రకటన రాలేదు.

 

ఇదిలా ఉంటే, తాజాగా మరో గాసిప్‌ చక్కర్లు కొడుతోంది. పవన్‌ కళ్యాణ్‌ తన సొంత బ్యానర్‌ అయిన పవన్‌ కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌లో ఇప్పటికే కొన్ని చిత్రాలు రూపొందించారు. నటించడం గురించి చెప్పలేను కానీ, సినిమాలు నిర్మిస్తాను.. అని పవన్‌ పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ క్రమంలో పవన్‌ కళ్యాణ్‌ నిర్మాణంలో రాబోతున్న తాజా చిత్రం అబ్బాయ్‌ రామ్‌చరణ్‌దే అంటున్నారు.

 

ప్రస్తుతం రామ్‌ చరణ్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత చరణ్‌ చేయాల్సిన చిత్రాలు అంతగా ఐడియా లేదు. కానీ, 'సైరా' తర్వాత సురేందర్‌ రెడ్డిని చెర్రీ లాక్‌ చేసి పెట్టాడనే టాక్‌ ఉంది. సో అన్నీ కుదిరితే ఒకవేళ బాబాయ్‌ బ్యానర్‌లో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ సినిమా ఉంటుందేమో. అది 'ఆర్‌ఆర్‌ఆర్‌' తర్వాతే ఉంటుందా.? లేక ఆ తర్వాతనా.? అనేది నిదానంగా తెలియాల్సి ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS