ఆ సినిమా రామ్ చ‌ర‌ణ్‌తోనేనా?

By Gowthami - June 05, 2020 - 09:37 AM IST

మరిన్ని వార్తలు

కేజీఎఫ్ సినిమాతో ఒక్క‌సారిగా అంద‌రి చూపూ త‌న వైపుకు తిప్పుకున్నాడు ప్ర‌శాంత్ నీల్. ఇప్పుడు కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తి కాక‌ముందే.. ప్ర‌శాంత్ కి ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా తెలుగు నాట నుంచి ఈ ద‌ర్శ‌కుడికి బోలెడ‌న్ని ఆఫ‌ర్లు. ఇప్ప‌టికే ఎన్టీఆర్ తో ఓ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు ప్ర‌శాంత్‌. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్‌తో కూడా ఓ సినిమా ఫిక్స్ చేసుకున్నాడ‌ని టాక్‌. ప్ర‌ముఖ నిర్మాత డివివి దాన‌య్య ప్ర‌శాంత్ నీల్‌తో ఓ సినిమా చేయ‌బోతున్నారు. అందుకు సంబంధించిన అడ్వాన్సులు కూడా అందేశాయ‌ని టాక్‌. ఆ సినిమాలో చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తార‌ని ప్ర‌చారం మొద‌లైంది.

 

చ‌ర‌ణ్‌తో పాటు ప్ర‌భాస్, మ‌హేష్ పేర్లు గ‌ట్టిగానే వినిపిస్తున్నాయి. ఇది వ‌ర‌కు మ‌హేష్ - ప్ర‌శాంత్ నీల్ మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగాయి. కానీ అవి ఓ కొలిక్కి రాలేదు. ఈలోగా ఎన్టీఆర్‌తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. చ‌ర‌ణ్ కూడా ప్ర‌శాంత్‌కి ట‌చ్‌లోకి వెళ్లాడ‌ని, ఇద్ద‌రి మ‌ధ్యా భేటీ జ‌రిగింద‌ని టాలీవుడ్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. చివ‌రికి ఏ హీరో ఫిక్స్ అవుతాడో మ‌రి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS