రామ్ చరణ్ స్పీడు మామూలుగా లేదు. ఆర్.ఆర్.ఆర్, ఆచార్య విడుదలకు రెడీ అయ్యాయి. ప్రస్తుతం శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు చరణ్. ఆ తరవాత... జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ఓసినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఆ తరవాతి సినిమా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తోనే. డివివి దానయ్య ఈ సినిమాకి నిర్మాత. ఇంత వరకూ బాగానే ఉంది. కాకపోతే.. ఇప్పటి వరకూ ప్రశాంత్ నీల్ ఈ సినిమా కథేంటో చరణ్ కి చెప్పలేదట.
ప్రశాంత్ సినిమాకి ఇంకా చాలా సమయం ఉంది.కాబట్టి.. కథ ఇప్పుడే రెడీ అయిపోదు.కనీసం లైన్ అయినా ఉండాలి కదా? అది కూడా లేదట. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ తో బిజీగా ఉన్నాడు. ఆ తరవాత ఎన్టీఆర్ సినిమా ఉంటుంది. ఇవి రెండూ పూర్తయిన తరవాతే...చరణ్ తో సినిమా. కాబట్టి.. చరణ్ కి ఎలాంటి కథ చేయాలి? అనే విషయంలో ఇంకా ఓ ఐడియాకి రాలేదట.చరణ్ కూడా ఈ కథ గురించి పెద్దగా ఆలోచించడం లేదని టాక్. ఎందుకంటే ప్రశాంత్ పై చరణ్ నమ్మకం పెట్టేసుకున్నాడు. ఎలాగూ మంచి కథే చెబుతాడని అనుకుంటున్నాడట. అందుకే కథ విషయంలో ప్రశాంత్ ని తొందర పెట్టడం లేదని తెలుస్తోంది. ఈ రోజుల్లో కథ కంటే, కాంబినేషన్ సెట్ అవ్వడమే కీలకం. ఇప్పుడు అలాంటి కాంబినేషన్ సెట్టయిపోయింది. ఆ తరవాత కథ రెడీ అవుతుంది.