'సౌండ్ ఇంజనీర్' గా రామ్ చరణ్- రంగస్థలం టీజర్ టాక్

మరిన్ని వార్తలు

అందరి ఎదురు చూపులకి తెరపడింది. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం టీజర్ కొన్ని నిమిషాల ముందే విడుదలైంది.

ఇక అందరు అనుకున్నట్టుగానే, ఊహించినట్టుగానే ఈ టీజర్ అందరిని ఆకట్టుకుంది. రామ్ చరణ్ ఒక పల్లెటూరి కుర్రాడు అయిన చిట్టిబాబు పాత్రలో మెరిశాడు, ఇక అదే సమయంలో చెవిటివాడి పాత్రని చరణ్ పోషించినట్టు అర్ధమవుతుంది. ఒక పెద్ద కమర్షియల్ హీరో ఇలాంటి పాత్ర చేయడానికి ఒప్పుకున్నందుకు అలాంటి పాత్రని రామ్ చరణ్ తో చేయిస్తున్న సుకుమార్ ని మెచ్చుకోకుండా ఉండలేము. 

టీజర్ లో చూస్తే, రామ్ చరణ్ అదే చిట్టి బాబు మాటల్లో చెప్పాలంటే- మనోడికి ఊళ్ళో ఉన్న పేరు- సౌండ్ ఇంజనీర్. ఎందుకంటే అందరు సౌండ్ వింటే మనోడు మాత్రం సౌండ్ ని చూసి అర్ధం చేసుకుంటాడు కాబట్టి. 

ఆఖరిగా కత్తి పట్టుకొని వచ్చే షాట్ లో రామ్ చరణ్ అదిరిపోయాడు అనే చెప్పొచ్చు. రత్నవేలు ఫోటోగ్రఫీ, దేవిశ్రీప్రసాద్ BGM అలాగే సుకుమార్ టేకింగ్ కలగలిపి ఈ రంగస్థలం కచ్చితంగా ప్రేక్షకులకి ఒక మంచి సినిమా ఇస్తుంది అన్న నమ్మకం ఈ టీజర్ కలిగిస్తుంది.

 

అభిమానుల ఎదురు చూపులకి ఈ టీజర్ తో ఒక మంచి సినిమా వారికోసం రానుంది అన్న భరోసా అయితే ఇవ్వగలిగాడు సుకుమార్.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS