ఇది వరకు చిరంజీవి సినిమా అంటే... ఏ టూ జెడ్ అన్ని విషయాలూ అల్లూ అరవింద్ నే చూసుకునేవారు. కథ వినడం దగ్గర్నుంచి, ఫస్ట్ కాపీలో మార్పులు చేర్పుల వరకూ అరవింద్ ప్రమేయం తప్పని సరి. ఖైదీ నెం.150కి మందు వరకూ ఇదే పద్ధతి. అంతెందుకు.. చరణ్ సినిమాలపై కూడా అల్లు బాగానే ఫోకస్ చేసేవారు. చరణ్ ఏ టైమ్ లో ఎవరితో సినిమా చేయాలి? ఎలాంటి కథతో చేయాలి? అనే విషయాల్లో తన ఆలోచనలు పంచుకునేవారు. అయితే ఇప్పుడు క్రమంగా.. అరవింద్ చిరు, చరణ్‌ల సినిమాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మానేశారు. చిరు సినిమాల విషయాలన్నీ చరణే చూసుకుంటున్నాడు.
చిరు కోసం వస్తున్న కథలు వినడంలోనూ, ప్రాజెక్టులు సెట్ చేయడంలోనూ చరణ్‌దే కీలక పాత్ర. అసలు బాబీ, మెహర్ రమేష్ కథలు సెట్టవ్వడం వెనుక చరణే ఉన్నాడని టాక్. అలా క్రమంగా అల్లు అరవింద్ స్థానాన్ని చరణ్ ఆక్రమించేసుకున్నాడు. అల్లు అరవింద్ కి కూడా చాలా పనులు పడ్డాయి. బన్నీ, శిరీష్‌ల కెరీర్ పై దృష్టి పెట్టాలి, ఆహా గురించి చూసుకోవాలి, కొత్తగా ఓ స్టూడియో కడుతున్నారు, వాటి పనులున్నాయి.
పైగా గీతా ఆర్ట్స్, జీఏ 2 సంస్థలున్నాయి. ఇవన్నీ అరవింద్ కనుసన్నల్లో సాగే విషయాలు. కాబట్టి చిరు, చరణ్‌ల కెరీర్ గురించి ఆయన పట్టించుకోవడం లేదు. మొత్తానికి ఈ రకంగానూ అల్లు అరవింద్ - చిరుకీ మధ్య చిన్న గ్యాప్ వచ్చిందని మెగా కాంపౌండ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.