పాట‌తో మొద‌లెడుతున్న శంక‌ర్‌

By iQlikMovies - July 27, 2021 - 11:00 AM IST

మరిన్ని వార్తలు

రామ్ చ‌ర‌ణ్ - శంక‌ర్ కాంబినేష‌న్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు నిర్మాత‌. కైరా అద్వాణీని క‌థానాయిక‌గా ఎంచుకున్నారు. ఈ సినిమాకి సంబంధించిన తాజా అప్ డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. సెప్టెంబ‌రు 8 నుంచి షూటింగ్ ని ప్రారంభించ‌బోతున్నారు. చ‌ర‌ణ్ - కైరాల‌పై ఓ పాట‌తో ఈ చిత్రానికి శ్రీ‌కారం చుట్ట‌బోతున్నారు. ఇప్ప‌టికే.. ఈ పాట‌కు సంబంధించి ఓ భారీ సెట్ వేయ‌డానికి రంగం సిద్ధం చేసిన‌ట్టు స‌మాచారం.

 

త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న కూడా అదిరిపోయే ట్యూన్ ఒక‌టి రెడీ చేసేశాడ‌ట‌. ఈ సినిమా షూటింగ్ అంతా హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లోనే జ‌ర‌గ‌బోతోంద‌ని స‌మాచారం అందుతోంది. ప్ర‌స్తుతం శంక‌ర్ హైద‌రాబాద్ లోనే ఉన్నాడు. ఆయ‌న లొకేష‌న్ల వేట‌లో బిజీగా ఉంటే, నిర్మాత దిల్ రాజు ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల్ని ఎంచుకోవ‌డంలో త‌ల‌మున‌క‌ల‌య్యారు. 2022 లో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తారు. ఇదో పొలిటిక‌ల్ డ్రామా అని, చ‌ర‌ణ్ రాజ‌కీయ నాయ‌కుడిగా న‌టిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ విష‌య‌మై చిత్ర‌బృందం ఇప్పటి వ‌ర‌కూ స్పందించ‌లేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS