వావ్‌ చరణ్‌ వాట్‌ ఏ మేకోవర్‌!

మరిన్ని వార్తలు

రామ్‌చరణ్‌ 'ధృవ' సినిమా కోసం చాలా మారాడు. తన కొత్త సినిమా కోసం ఇంకా మారుతున్నాడు. ఆ మార్పు ఎలా ఉంటుందో ఇప్పటికైతే సస్పెన్సే. కానీ ఆ మార్పుకి సంబంధించి ఓ ఫీలర్‌ వదిలారు. మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా షూటింగ్‌ లాంఛనంగా ప్రారంభమయ్యింది. మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి. ఈ సందర్బంగా మైత్రి మూవీ మేకర్స్‌, చరణ్‌ లుక్‌తో కూడిన పోస్టర్‌ని విడుదల చేశారు. సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేసిన ఈ ఫొటోకి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అయితే ఇందులో చరణ్‌ ఇమేజ్‌ని లైన్‌ ఆర్ట్‌లో రూపొందించారు. అది కూడా బ్యాక్‌ సైడ్‌ వ్యూ. చరణ్‌ ఇలా ఉంటాడని జస్ట్‌ ఓ ఫీలర్‌ వదిలారనుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడా చాలా ఇన్నోవేటివ్‌గా ఉంది ఈ లుక్‌ డిజైనింగ్‌. సుకుమార్‌ సినిమాల ప్రత్యేకత అదే. ఇప్పటికే ఈ సినిమా కోసం చరణ్‌ గడ్డం పెంచేశాడు. పల్లెటూరి యువకుడిలా పంచెకట్టులో, కావడి మోస్తూ ఉన్న చరణ్‌ ఈ సినిమాతో నటుడిగా తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించేలా కనిపిస్తున్నాడు. చరణ్‌తో తొలిసారి సమంత జోడీ కడ్తోంది ఈ సినిమాలో. అలాగే రాశి ఖన్నా మరో హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఏదేమైనప్పటికీ చరణ్‌ మేకోవర్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికరమైన అంశంగా మారింది. 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS