అందరికీ పుట్టినరోజు అంటే ఎంతోకొంత ఆసక్తి, ఆనందం ఉంటాయి. కాని ఈ ట్వీట్ సైంటిస్ట్ కి మాత్రం పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేవాళ్ళు అన్నా పుట్టినరోజు జరుపుకొనే వాళ్ళు అన్నా కొంచెం కాదు పెద్ద చిన్న చూపు.
ఇలా ఎందుకబ్బా అని అనుకోకండి! ఇలా ఎందుకంటే తను సాధారణ వ్యక్తి కాదు ఓ అసాధారణ మేధావి అయిన ఆర్జీవీ కాబట్టి. తన జీవించే విధానం ఎలా ఉంటుందంటే, చూసేవారిలో సగం మందికి ఇలా బ్రతకగిలిగితే చాలు, ఇంకో సగం మందికి ఇలా బ్రతకపోతేనే నయం అనుకునేలా...
తన సినిమాల్లో హిట్స్ అన్ని యాక్సిడెంటల్, ఫ్లాపులు మాత్రం ఇన్సిడెంటల్ అని చెప్పి మరి తన వైపుకు తిప్పుకోగల నేర్పరి. నా చావు నేను చస్తా అని చెప్పి మరి మన దృష్టిని తన వైపు తిప్పుకోగల ఇంటెలిజెంట్. గ్యాంగ్ వార్స్ నేపధ్యంలో సినిమాలు తీసిన ఆర్జీవి, తన నిజజీవితంలో గన్, గ్యాంగ్ లేకుండా బ్రతుకుతున్న ఒక పెద్ద డాన్.
తన ఇంటలిజెన్స్ తో జనాలని షాక్ కి గురిచేస్తున్న ఆర్జీవి మాత్రం ట్విట్టర్ కి కచ్చితంగా రుణపడ్డాడు.
చివరగా- మీ స్టైల్ లో చెప్పాలంటే, మమ్మల్ని అలరించే మీ జీవితంలో ఒక సంవత్సరం తగ్గిపోయింది అన్న బాధ మాకూ ఉంది.