వర్మతో సినిమాలు చేయాలంటే నిర్మాతలు పారిపోతున్నారు. దాదాపుగా అన్నీ సొంత సినిమాలే తీసుకొంటున్న వర్మ... ఇప్పుడు వైకాపా నేతల కంట్లో పడ్డాడు. వైకాపా పార్టీ కోసం వర్మ వ్యూహం, శపథం అనే రెండు సినిమాల్ని తీయబోతున్న సంగతి తెలిసిందే.
ఈ డిసెంరులో వ్యూహం సినిమా మొదలవుతుంది. అందుకు సంబంధించి నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్నీ ఎంపిక చేసే పనిలో బిజీగాఉన్నాడు వర్మ. ఈ రెండు సినిమాలకు గానూ.. రూ.60 కోట్ల బడ్జెట్ కేటాయించార్ట. ఓ వైకాపా నేత ఈ సినిమాకి తెర వెనుక నుంచి ఆర్థిక సహకారం అందిస్తున్నట్టు టాక్. ప్రభుత్వమే వాళ్లది కాబట్టి.. ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవొచ్చు. కానీ వర్మ... భారీ స్థాయిలో సినిమాలు తీసే రకం కాదు. పైగా తన సినిమాల్లో స్టార్లు కూడా ఉండరు. చాలా తక్కువ బడ్జెట్ లో సినిమాల్ని చుట్టేస్తుంటాడు. 60 కోట్లతో పది సినిమాలు తీయగల నేర్పుతనకుంది. అంటే.. ఈ రెండు సినిమాల్ని ఎంతలో ముగిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మిగిలిందంతా వర్మ ఎకౌంట్ లోకే. అసలే ఈమధ్య వర్మ... పీకల్లోతు అప్పుల్లో ఉన్నాడని సమాచారం. ఈ రెండు సినిమాలతో తన అప్పులన్నీ తప్పుకొన్నట్టే. ఈ రెండు సినిమాలతో వైపాకాకి ఎంత ఉపయోగమే.. మిగిలిన పార్టీలకు ఎంత నష్టమో తెలీదు గానీ... వర్మకి మాత్రం ఫుల్ లాభం.