దసరా బరిలోకి 'హైపర్‌' హీరో

మరిన్ని వార్తలు

సినిమా విడుదలకు దసరా స్లాట్‌ వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ స్లాట్‌. అందుకే స్టార్‌ హీరోల సినిమాలు ఈ సీజన్‌లో క్యూ కడతాయి. అలాగే స్టార్‌ హీరోలతో పాటు, చిన్న హీరోలు కూడా ఈ సీజన్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటారు. ఆ దిశగానే ఈ దసరా బరిలో ఆల్రెడీ స్టార్‌ హీరో ఎన్టీఆర్‌ 'అరవింద సమేత' సినిమా లైన్‌లో ఉంది. మరో స్టార్‌ హీరో నాగార్జున, నానితో చేస్తున్న మల్టీ స్టారర్‌ 'దేవదాస్‌'ని కూడా ఈ సీజన్‌లోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

దీంతో పాటు, చైతూ 'సవ్యసాచి', ఫెస్టివల్‌ హీరో శర్వానంద్‌ 'పడి పడి లేచె' తదితర సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇకపోతే తాజాగా మరో యంగ్‌హీరో రామ్‌ నటిస్తున్న 'హలో గురూ ప్రేమ కోసమే' చిత్రాన్ని కూడా ఈ సీజన్‌లోనే విడుదల చేసేందుకు చిత్రం యూనిట్‌ నిర్ణయించుకుంది. అక్టోబర్‌ 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్‌తో ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్‌ జోడీ కడుతోంది. నక్కిన త్రినాధ రావు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. 'సినిమా చూపిస్త మామ', 'నేను లోకల్‌' చిత్రాలతో వరుసగా హిట్లు కొట్టిన డైరెక్టర్‌ నక్కిన త్రినాధరావు 'హలో గురూ ప్రేమ కోసమే' చిత్రం విజయం పైనా పూర్తి నమ్మకంతో ఉన్నారు. 

అందులోనూ ఈ చిత్రాన్ని దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. దిల్‌ రాజు చెయ్యేస్తే, అది హిట్‌ సినిమా కిందే లెక్కే. ఆ యాంగిల్‌లో ఈ సినిమాకి విజయం పక్కా అని భావించాలి. చూడాలి మరి వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రామ్‌కీ, ఇటీవల 'తేజ్‌ ఐలవ్‌యూ'తో నిరాశపరిచిన అనుపమాకి ఈ సినిమాతో హిట్టు దక్కుతుందో లేదో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS